- Advertisement -
ఇండిపెండెంట్ అభ్యర్థి ప్రియదర్శన గిరి
నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ మండలంలోని తడి హిప్పర్గా గ్రామానికి జరుగుతున్న సర్పంచ్ ఎన్నికల్లో గ్రామ ప్రజలు అవకాశం ఇస్తే గ్రామ అభివృద్ధికి ప్రత్యేకంగా కృషి చేస్తానని స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న ప్రియదర్శన గిరి అన్నారు. గ్రామంలో జనరల్ మహిళగా రిజర్వేషన్ వచ్చింది. ఈ గ్రామానికి పార్టీల పరంగా పోటీ చేస్తున్న ఇతరుల కంటే ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసే ప్రియదర్శన గిరి విద్యావంతురాలు. తమను గ్రామ ప్రజలు సర్పంచ్ గా ఎన్నుకునేందుకు ఒక అవకాశం ఇవ్వాలని ఆమె గ్రామ ప్రజలకు విజ్ఞప్తి చేసింది. తననున సర్పంచుగా గెలిపిస్తే అభివృద్ధితో పాటు గ్రామ ప్రజల సమస్యలను ఎల్లవేళల కృషి చేస్తానని తెలిపారు.
- Advertisement -



