- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణ కొత్త రాష్ట్రమైనప్పటికీ అభివృద్ధిలో దూసుకుపోతున్నట్లు సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. సరికొత్త లక్ష్యాలు నిర్దేశించుకొని ముందుకు సాగుతున్నామన్నారు. 2047 నాటికి తెలంగాణ 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా ఎదగాలనేది ఆశయమన్నారు. కేంద్ర ప్రభుత్వం సైతం 2047 నాటికి 30 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. దేశ జీడీపీలో తెలంగాణ వాటా 10 శాతం ఉండాలనేది తమ ఆశయమని సీఎం అన్నారు. లక్ష్యం పెద్దదైనా సాధిస్తామనే నమ్మకం ఉంది. అందరి సహకారంతో అనుకున్నది సాధిస్తాం అని సీఎం రేవంత్ స్పష్టం చేశారు.
- Advertisement -


