రేషన్ దుకాణాలను తనిఖీ చేసిన తహశీల్దార్
బియ్యం దందా చేస్తున్న వారిపై క్రిమినల్ కేసులు పెడతాం
బియ్యం అమ్ముకుంటే లబ్ధిదారుల రేషన్ కార్డులు తొలగిస్తాం : తహశీల్దార్ సైదులు
నవతెలంగాణ – అచ్చంపేట
సోమవారం నవ తెలంగాణలో అచ్చంపేటలో సన్నబియ్యం దందా… దొరుకుతేనే దొంగ అనే శీర్షికతో వార్తా ప్రచురితం కావడం జరిగింది. దీనికి అచ్చంపేట తహశీల్దార్ సైదులు స్పందించారు. సోమవారం ఉదయం పట్టణంలోని రేషన్ దుకాణాలను తనిఖీ చేశారు. ఒక్కొక్క రేషన్ దుకాణంలో నిలువ ఉన్న బియ్యం ఎన్ని క్వింటాళ్లు.. రికార్డులో ఎన్ని క్వింటాళ్లు బియ్యం ఉన్నాయి తదితర రికార్డులను పరిశీలించారు. పేదలకు పంపిణీ చేయవలసిన సన్నబియ్యం బ్లాక్ మార్కెట్ కు తరలిస్తే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని, అదేవిధంగా రేషన్ కార్డు లబ్ధిదారులు డీలర్లకు ఇతర షాపులలో బియ్యం అమ్ముతున్నట్లు తెలుస్తుంది. విచారణలో నిజం అని నిర్ధారణ అయితే రేషన్ కార్డులు తొలగిస్తామని హెచ్చరించారు.
నవతెలంగాణ వార్తకు స్పందన
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



