Monday, December 8, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కల్వకుంట్ల గ్రామాన్ని అభివృద్ధి చేసేందుకు ఆశీర్వదించండి..

కల్వకుంట్ల గ్రామాన్ని అభివృద్ధి చేసేందుకు ఆశీర్వదించండి..

- Advertisement -

కత్తెర గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని వేడుకుంటున్న సింగపంగ లక్ష్మమ్మ ..
ప్రజల పక్షాన పోరాడే ప్రశ్నించే గొంతులను గెలిపించండి (బండ శ్రీశైలం) ..
నవతెలంగాణ – మునుగోడు

కల్వకుంట్ల గ్రామంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించి గ్రామాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసేందుకు ఆశీర్వదించాలని బిఆర్ఎస్ , ధర్మసమాజ్ పార్టీ  బలపరిచిన సీపీఐ(ఎం) సర్పంచ్ అభ్యర్థి సింగపంగ లక్ష్మమ్మ గ్రామ ప్రజలను కోరారు. సోమవారం మండలంలోని కల్వకుంట్ల గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గ్రామంలో కనీస సౌకర్యాలు లేక గ్రామ ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారని, గ్రామంలో నెలకొన్న సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రతి వార్డులో ఉన్న సమస్యలను గుర్తించి పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. తమను అత్యధిక మెజార్టీతో గెలిపించాలనే లక్ష్యంతో  బిఆర్ఎస్ , ధర్మసమాజ్ పార్టీ నాయకులతో కలిసి సీపీఐ(ఎం) గ్రామంలో చేసిన అభివృద్ధి పనులను గ్రామ ప్రజలకు తెలియజేస్తూ , గ్రామంలోని ప్రజలు డబ్బు మద్యం ప్రలోభాలకు లొంగకుండా కత్తెర గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని వేడుకుంటున్న నాయకుల ప్రచారానికి గ్రామంలోని ప్రజలలో తమను గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారని ధీమా వ్యక్తం చేశారు.

ప్రజల పక్షాన పోరాడే ప్రశ్నించే గొంతులను గెలిపించండి..
పేద ప్రజలకు ఎక్కడ సమస్య వచ్చినా ప్రజల పక్షాన ప్రశ్నించే గొంతుగా ప్రజల పక్షాన పోరాటాలు నిర్వహించే ప్రశ్నించే గొంతులను గెలిపించాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు బండ శ్రీశైలం కోరారు సోమవారం మండలంలోని కల్వకుంట్ల, కొంపల్లి , మునుగోడు , కల్వలపల్లి గ్రామాలలో సీపీఐ(ఎం) బలపరిచిన అభ్యర్థులు, పోటీ చేసే అభ్యర్థుల ఇంటింటి ప్రచారంలో ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  సీపీఐ(ఎం) పోటీ చేసే స్థానాలలో గెలిపించేందుకు పేద ప్రజలు సిద్ధంగా ఉన్నారని అభిప్రాయపడ్డారు.

ప్రజలను మోసం చేసేందుకు వచ్చే ప్రజాప్రతినిధులు డబ్బులతో ప్రజల్ని ప్రలోభ పెట్టి ఓట్లు వేయించుకునేందుకు వచ్చిన వారికి ప్రజలు ఓటు వేసేందుకు సిద్ధంగా లేరని అన్నారు. ఎన్నో సమస్యల పరిష్కారం కోసం ఎర్రజెండా నెత్తి పోరాటం చేసిన నాయకులకు ప్రజలలో మంచి ఆదరణ ఉన్నదని అన్నారు. మునుగోడు మండలంలోని కల్వకుంట్ల గ్రామంలో ఎర్ర జెండా కున్న పోరాట చరిత్ర ప్రజలలో చెదరని ముద్రగ నిలిచి ఉంటుందని అన్నారు. గ్రామంలోని ప్రజలు చాలా చైతన్యమైన ప్రజలని అన్నారు . డబ్బు , మద్యంతో ప్రలోభ పెట్టే బరిలో నిలిచే నాయకులను ఓడించి , పేద ప్రజలకు ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ ప్రజల పక్షాన నిలిచి పోరాటం చేసే సీపీఐ(ఎం) అభ్యర్థి కత్తెర గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. నియోజకవర్గంలో నెలకొన్న అనేక సమస్యలను పరిష్కారం చేసుకునేందుకు పోరాటం చేసే ఎర్రజెండాను గెలిపించాలని కోరారు . 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -