నవతెలంగాణ- కంఠేశ్వర్
నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య శాంతియుత వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు అన్ని రకాల పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశామని తెలిపారు. మొదటి విడత బోధన్ డివిజన్ పరిధిలో గ్రామ పంచాయతీ ఎన్నికలు గలవు. ఇట్టి సబ్ డివిజన్ పరిధిలో 11 మండలాలలో 1084 గ్రామపంచాయతీలు 1642 వార్డులలో 268 పోలింగ్ కేంద్రాలలో 2,61,210 మంది ఓటర్లు గలరు.
ఈ నేపథ్యంలో నిజామాబాద్ పోలీస్ శాఖ పరంగా ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు బందోబస్తు ఏర్పాట్లు చేయడం జరిగింది ఇందుకుగాను సబ్ డివిజన్ పరిధిలోని ఎన్నికలు నిర్వహించే ప్రాంతాలలో మూడు చెక్ పోస్ట్ లను ( సాలూర , కండ్ గావ్, పోతంగల్ ) ఏర్పాటు చేసి నిర్విరామముగా నిఘా వ్యవస్థ ఏర్పాటు చేసి 24 / 7వాహనాల తనిఖీలు నిర్వహించడం జరుగుతుంది.లిక్కర్ మొత్తం 361.46 లీటర్లు సీజీ చేయడం జరిగింది, వాటి విలువ దాదాపు 2,56,985/- గలదు.బోధన్ డివిజన్ పరిధిలో బైండోవర్ లు మొత్తము 183 మందిని సంబంధిత తహసీల్దారుల ముందు హాజరు పరిచి బైండోవర్ చేయడం జరిగింది.
బోధన్ డివిజన్ పరిధిలో ఈ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తన నియమా నియమావళిని ఉల్లంఘించినటువంటి వారిపై మూడు కేసుల నమోదు చేయడం జరిగింది . ఎడపల్లి , బోధన్ రూరల్ , కోటగిరి పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో సబ్ డివిజన్ పరిధిలోని మొత్తం 10 గన్ లైసెన్లు కలిగినటువంటి వారిని డిపాజిట్ చేయమని తెలియజేయగా ఆరుగురు డిపాజిట్ చేయడం జరిగింది. మిగతా నాలుగు గన్ లైసెన్సులు బ్యాంకులకు సంబంధించినవి గలవు.ఎన్నికల నేపథ్యంలో శాంతిభద్రతలకు ఎక్కడ ఎలాంటి విఘాతం కలగకుండా ముందస్తు జాగ్రత్తగా పటిష్టమైన నిఘా వ్యవస్థ ఏర్పాటు చేసి మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో 1384 మందిని సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది అని తెలియజేశారు.



