నవతెలంగాణ-హైదరాబాద్: ఢిల్లీ పేలుళ్ల కేసులో అరెస్టయిన ముగ్గురు వైద్యులు, మత ప్రచారకుడి ఎన్‌ఐఎ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా నిందితుల కస్టడీని ఢిల్లీ కోర్టు సోమవారం నాలుగు రోజులు పొడిగించింది. నవంబర్ 29న విధించిన 10 రోజుల ఎన్‌ఐఎ గడువు ముగియడంతో.. అధికారులు ముగ్గరు వైద్యులు ముజమ్మిల్ గనై, అదీల్ రాథర్, షహీనా సయీద్, మౌలావీ ఇర్ఫాన్ అహ్మద్ వాగేలను నేడు పాటియాలా హౌస్ జిల్లా కోర్టులో హాజరుపరిచారు. ఎన్‌ఐఎ కస్టడీని మరోసారి పొడిగిస్తూ ప్రిన్సిపల్, సెషన్స్ జడ్జీ అంజు బజాజ్ చంద్నా ఉత్తర్వులు జారీ చేశారు. కోర్టు కార్యకలాపాలను కవర్ చేయకుండా మీడియాపై నిషేధం విధించారు. ఈ కేసులో ఇప్పటివరకు ఎన్‌ఐఎ ఏడుగురిని అరెస్ట్ చేసింది.
ఢిల్లీ పేలుళ్లు..నిందితుల కస్టడీ పొడిగింపు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



