సీపీఐ(ఎం) మండల కార్యదర్శి ఈసంపల్లి సైదులు
నవతెలంగాణ – నెల్లికుదురు
సీపీఐ(ఎం) బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని సీపీఐ(ఎం) మండల కార్యదర్శి ఈసంపల్లి సైదులు ఓటర్లను కోరినట్లు తెలిపారు. మండలంలోని మండలంలోని మున్నిగల వీడు గ్రామంలో సోమవారం ఆట పాటలతో వాడవాడన కళకారులతొ ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నెల్లికుదురు మండలంలోని మునిలవీడు గ్రామంలో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సీపీఐ(ఎం) బలపరిచిన అభ్యర్థిని గెలిపించాలని ఇంటింటికీ వెళ్లి ఓటర్లను కోరినట్లు తెలిపారు.
ప్రజా సమస్యలు పరిష్కారం కావాలంటే ఎర్రజెండా అనే మార్గమని ఆ దిశగా వ్యవసాయ కార్మికులు రైతులు అసంఘటిత కార్మికులు మహిళలు మేధావులు విద్యార్థులు అధిక సంఖ్యలో తమ సంపూర్ణ మద్దతును తెలియజేస్తూ గెలిపించాలని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై రైతులకు గిట్టుబాటు ధర కావాలని ఎరువులు ఉచితంగా అందించాలని వ్యవసాయ కార్మికులకు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని ఎన్నికల ముందు ఇచ్చిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు హామీలను అమలు చేయాలని ప్రభుత్వా ని డిమాండ్ చేశారు. పేద ప్రజల సమస్యల కోసం రాజకీయాలకతీతంగా పనిచేసే గ్రామాన్ని అభివృద్ధి పరచడంలో తమ వంతు బాధ్యతగా నిర్వహిస్తానని అన్నారు. ఈ ప్రచార కార్యక్రమంలో సీపీఐ(ఎం) గ్రామ శాఖ నాయకులు బత్యం సత్యనారాయణ, ఎండి యాకూబ్, మచ్చ వెంకన్న, బిచ్చ నాయక్, బండ వెంకన్న ,వెంకటయ్య ,దుర్గమ్మ ,పవన్, సంతోష్, తదితరులు పాల్గొన్నారు.



