Monday, December 8, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్గత పాలకులపై విసిగిపోయిన పసర ప్రజలు

గత పాలకులపై విసిగిపోయిన పసర ప్రజలు

- Advertisement -

నవతెలంగాణ – గోవిందరావుపేట
మండల పరిధిలోని పసర గ్రామపంచాయతీ సిపిఎం పార్టీ సర్పంచ్ అభ్యర్థి గొంది దేవేంద్ర రాజేష్ కత్తెర గుర్తు ప్రచారంలో దూసుకుపోతుంది. సోమవారం పసర గ్రామంలో సీపీఐ(ఎం) పార్టీ అభ్యర్థి సనప దేవేంద్ర రాజేశ్ విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల నుండి విస్తృతమైన ఆదరణ లభిస్తుంది. ఏ నోట విన్న కత్తెర గుర్తుకు ఓటేస్తాం. గెలిపిస్తామని ప్రజలు అభిప్రాయాన్ని వెలబుచ్చుతున్నారు. గత కాంగ్రెస్ పాలనలో ప్రజలు విసిగి వేసారి పోయారని గ్రామ అభివృద్ధి కుంటపడిందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. గ్రామం అభివృద్ధి కావాలంటే సౌమ్యుడు నిజాయితీపరుడు అయినా గొంది రాజేష్ దేవేంద్ర గార్లకు ఓటు వేసి గెలిపిస్తామని తెలిపారు. ఇప్పటికైనా ప్రజలు విజ్ఞతతో ఆలోచించి సీపీఐ(ఎం) అభ్యర్థి సనప దేవేంద్ర రాజేష్ ల కత్తెర గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని సీపీఐ(ఎం) మండల కార్యదర్శి సోమ మల్లారెడ్డి విజ్ఞప్తి చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -