కోపం సర్వసాధారణమైన భావన. ప్రతి ఒక్కరికీ ఏదో ఒక సందర్భంలో కోపం కట్టలు తెంచుకొని బయటకు రావటం ఖాయం. ఎంతో ప్రశాంతంగా, కూల్‌గా, సంయమనంతో ఉన్న వ్యక్తికి కూడా ఎక్కడో అక్కడ కోపం రాకుండా ఉండదు. కొంత మందికి మరీ ఎక్కువగా వస్తుంటుంది. మరికొందరు ఎంత ట్రైచేసినా దాన్ని కంట్రోల్ చేసుకోలేరు. ఇది వినటానికి చిన్న సమస్యే అయినా కొన్ని సందర్భాల్లో కోపం వల్ల మానసిక ఆరోగ్యం కోల్పోవడమే కాక, బీపీ వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ కోపానికి హార్మోన్లు కారణమని ఎంతమందికి తెలుసు? సాధారణంగా మనకు కోపం వచ్చినప్పుడల్లా.. శరీరంలోని రెండు ప్రధాన హార్మోన్లు, అడ్రినలిన్ కార్టిసాల్ అధిక మోతాదులో ఉత్పత్తి అవు తాయి. విపరీతమైన ఒత్తిడికి గురైనా లేదా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఈ హార్మోన్లను విడుదల అవుతాయి. వీటివల్ల హృదయ స్పందన రేటు పెరుగుతుంది. కండరాలు ఉద్రిక్తంగా మారతాయి. ఆరోగ్యానికి చేటు చేసే ఈ కోపాన్ని తగ్గించుకోవడం చాలా మంచిది.
ఎలా నియంత్రించుకోవాలంటే..
– కోపం రాగానే లోతైన శ్వాస తీసుకోని నెమ్మదిగా గాలిని బయటకు వదలాలి. ఇలా చేయడం వల్ల మనస్సుకు ప్రశాంతం లభిస్తుంది. దీనివల్ల మెదడుకు పుష్కలంగా ఆక్సిజన్ అందుతుంది.
– క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల శారీరక ఆరోగ్యం మెరుగుపడి, ఒత్తిడి తగ్గుతుంది. తద్వారా కోపం వచ్చే అవకాశాలు తగ్గిపోతాయి. మానసిక ప్రశాంతత కూడా తోడవుతుంది.
– తరచూ కోపానికి గురవుతుంటే మాత్రం, ఆ భావన ఎందుకు కలుగుతుందన్న విషయంపై లోతుగా ఆలోచించాలి. అంతలా ఇబ్బంది పెడుతోన్న అంశాన్ని తెలుసుకొని దాన్ని అధిగమించేందుకు ప్రయత్నించాలి.
– భావోద్వేగాలను అదుపులో ఉంచుకుంటే ఈ సమస్య నుంచి తేలికగా బయటపడవచ్చు.
కోపం వస్తోందా!
- Advertisement -
- Advertisement -



