తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా జంటగా నటిస్తున్న చిత్రం ‘ఓం శాంతి శాంతి శాంతిః’. ఏఆర్ సజీవ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఎస్ ఒరిజినల్స్, మూవీ వెర్స్ స్టూడియోస్ సంయుక్తంగా మద్దతునిస్తున్నాయి.
సజన్ యరబోలు, ఆదిత్య పిట్టీ, వివేక్ కష్ణని, అనుప్ చంద్రశేఖరన్, సాధిక్ షేక్, నవీన్ సనివరపు నిర్మిస్తున్నారు.
ఈ సినిమా జనవరి 23న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ టీజర్‌ని లాంచ్ చేసింది.
తరుణ్ భాస్కర్ మాట్లాడుతూ, ‘ఇది నాకు చాలా ప్యాషనేట్ ప్రాజెక్ట్. సినిమా మనకి మరో జీవితం జీవించే అవకాశాన్ని ఇస్తుంది. నాకు అలాంటి అవలాశం ఇచ్చిన నిర్మాత సజన్, డైరెక్టర్ సజీవ్, టీమ్ అందరికీ థ్యాంక్యూ. గోదారి యాస, కల్చర్‌కి ఒక సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చిన సినిమా ఇది’ అని తెలిపారు. ”35′ సక్సెస్ తర్వాత ఈ ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు చాలా భయమేసింది. ఈ సినిమాని చూస్తున్నప్పుడు అసలు ఇది రీమేక్ అని గుర్తు రాకూడదు. దానికోసం ఎలా చేయాలో అది అచీవ్ చేసామని గట్టిగా నమ్ముతున్నాను. సినిమా చూసి బయటకు వచ్చినప్పుడు చాలా సర్‌ప్రైజ్ అవుతారు’ అని ప్రొడ్యూసర్ సజన్ చెప్పారు. డైరెక్టర్ సజీవ్ మాట్లాడుతూ,’అందరికీ ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇచ్చే సినిమా ఇది’ అని తెలిపారు.
సర్‌ప్రైజ్ చేస్తుంది
- Advertisement -
- Advertisement -



