ఎంఎల్‌ఆర్‌ఐటీ చైర్మెన్ మర్రి లక్ష్మణ్‌రెడ్డి
హైదరాబాద్ : నిత్యం పని ఒత్తిడితో సతమతమయ్యే పాత్రికేయులకు ప్రొఫెషనల్ స్థాయిలో జర్నలిస్ట్ ప్రీమియర్ లీగ్ (జేపీఎల్) నిర్వహించటం అభినందనీయమని ఎంఎల్‌ఆర్‌ఐటీ చైర్మెన్ మర్రి లక్ష్మణ్‌రెడ్డి అన్నారు. నెక్ జేపీఎల్ రెండో రోజు పోటీలకు ముఖ్య అతిథిగా హాజరైన లక్ష్మణ్‌రెడ్డి సాక్షి, బిగ్‌టీవీ మ్యాచ్‌ను టాస్ వేసి ఆరంభించారు. ‘జర్నలిస్ట్‌లు పనితో పాటు ఫిట్‌నెస్‌పై దష్టి సారించాలి. ప్రతి రోజు అర గంట వ్యాయమానికి కేటాయించాలి. వెటరన్ క్రీడాకారులు మలి వయసులోనూ ఉత్సాహంగా మైదానంలో పోటీపడుతున్నారు. వారిని స్ఫూర్తిగా తీసుకుని జర్నలిస్ట్‌లు క్రీడల్లోనూ క్రీయాశీలంగా ఉండాలి. మంచి ఆరోగ్యంతోనే మెరుగైన జీవనం సాధ్యమని’ మర్రి లక్ష్మణ్‌రెడ్డి అన్నారు. సోమవారం ఎంఎల్‌ఆర్‌ఐటీ క్రికెట్ గ్రౌండ్‌లో జరిగిన నెక్ జేపీఎల్ మ్యాచ్‌లో బిగ్‌టీవీపై సాక్షి 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బిగ్‌టీవీ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 115 పరుగులు చేసింది. ఊరించే లక్ష్యాన్ని సాక్షి 12.5 ఓవర్లలోనే ఛేదించింది. సతీశ్ (48), రమేశ్ (47 నాటౌట్) రెండో వికెట్‌కు 96 పరుగుల భారీ భాగస్వామ్యంతో మ్యాచ్‌ను ఏకపక్షం చేశారు. అంతకుముందు జరిగిన మరో మ్యాచ్‌లో జీ మీడియాపై టీవీ5 జట్టు 84 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత టీవీ5 17.3 ఓవర్లలో 127 పరుగులకు ఆలౌట్ కాగా.. ఛేదనలో జీ మీడియా 9.2 ఓవర్లలో 43 పరుగులకే కుప్పకూలింది.
జేపీఎల్ నిర్వహణ భేష్
- Advertisement -
- Advertisement -



