– విద్యుత్ వ్యవస్థను సమూలంగా మారుస్తాం
– గ్రీన్ బాండ్లు , ప్రత్యేక లోన్లు, ప్రపంచ సంస్థల నుంచి నిధుల సమీకరణ
– తెలంగాణ భవిష్యత్ ఇంధనం-గ్రీన్ ఎనర్జీ దిశలో ముందడుగు అంశంపై డిప్యూటీ సీఎం భట్టి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
తెలంగాణ 2047 నాటికి అత్యంత శక్తివంతంగా ఎదిగేలా లక్ష్యాలను నిర్దేశిం చుకుని ముందుకు సాగుతున్నామనీ, తమ దార్శనికత వెనక జాతీయావాద దృక్పథం, ప్రయోజనం, దృఢమైన సంకల్పం ఉన్నాయని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క చెప్పారు. విద్యుత్ వ్యవ స్థను సమూలంగా మార్చే విషయంలో రాజీపడబోమని స్పష్టం చేశారు. మరింత సౌర విద్యుత్, బ్యాటరీ నిల్వ వ్యవస్థలు, అవసరాన్ని బట్టి మారే థర్మల్ ప్లాంట్లు, బలమైన కరెంట్ గ్రిడ్లు, డిజిటల్ పంపిణీ వ్యవస్థలు కావాలనీ, వాటికి అవసరమైన డబ్బులను ప్రభుత్వం సమకూర్చడంతో పాటు గ్రీన్ బాండ్లు, ప్రత్యేక లోన్లు, ఇతర ప్రపంచ సంస్థల నుంచి సమీకరించే అవకాశాలపై పరిశీలిస్తున్నామన్నారు. సోమవారం ఫ్యూచర్‌సిటీలో ప్రారంభమైన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌లో తెలంగాణ భవిష్యత్తు ఇంధనం-గ్రీన్ ఎనర్జీ దిశలో ముందడుగు అంశంపై ఆయన మాట్లాడారు. 2047 నాటికి 3 లక్షల కోట్ల డాలర్ల (3 ట్రిలియన్) ఆర్థిక శక్తిగా ఎదగడం, భారత స్థూల జాతీయ ఉత్పత్తిలో (జీడీపీ) పదిశాతం వాటా తెలంగాణా నుంచే రావాలన్నది తమ ఆశయమని తెలిపారు. పర్యావరణ హిత ఇంధనానికి అత్యంత ప్రాధాన్యమి స్తున్నామన్నారు. భారతదేశంలోనే అతిపెద్ద ‘ఎలక్ట్రిక్ బస్సుల’ వ్యవస్థను 2030 నాటికి హైదరాబాద్‌లో ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నా మని చెప్పారు. రాష్ట్రంలో మరో 20 గిగా వాట్ల పున రుత్పాదక ఇంధన శక్తిని సృష్టించు కోవడంపై ప్రణాళికలు రచిం చామని తెలిపారు. పచ్చదనాన్ని పెంచడం, కాలు ష్యం లేని పరిశ్రమలను ఆహ్వానిం చడం తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. బొగ్గు ఉత్పత్తి చేస్తున్న జిల్లాల్లో టూరిజం, ఆహార శుద్ధి, బట్టల పరిశ్రమలు, సోలార్ ఉత్పత్తుల తయారీ, తదితర పరిశ్రమలను ఏర్పాటు చేయొచ్చన్నారు. చిన్న పరి శ్రమలకు సాయం చేస్తామనీ, బొగ్గు ఆధారిత జిల్లాలను పచ్చని ఆర్థిక కేంద్రాలుగా మారుస్తామని హామీనిచ్చారు.
2047 నాటికి అత్యంత శక్తివంతంగా తెలంగాణ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



