- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: సర్పంచ్ ఎన్నికల వేళ మహబూబాబాద్ జిల్లా నడివాడ గ్రామంలో విషాదం నెలకొంది. కాంగ్రెస్ మద్దతుతో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న రాగిపాటి బుచ్చిరెడ్డి గుండెపోటుతో మృతి చెందారు. సోమవారం బుచ్చిరెడ్డికి ఉన్నటుండి గుండెపోటు రావడంతో ఓ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. కాగా గతంలో రెండుసార్లు సర్పంచ్ గా పోటీ చేసి బుచ్చిరెడ్డి ఓడిపోయారు. మరో రెండు రోజుల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగనుండగా ఆయన మృతిచెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
- Advertisement -



