– నియోజకవర్గ అధికార ప్రతినిధి అయిలేని మల్లికార్జున రెడ్డి
నవతెలంగాణ- హుస్నాబాద్ రూరల్
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కెసిఆర్ చేసిన పోరాటం ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేరని బి ఆర్ ఎస్ హుస్నాబాద్ నియోజకవర్గ అధికార ప్రతినిధి అయిలేని మల్లికార్జున రెడ్డి అన్నారు. మంగళవారం హుస్నాబాద్ లో బి ఆర్ యస్ పార్టీ ఆధ్వర్యంలో బి ఆర్ ఎస్ విజయ దివాస్ సందర్భంగా అంబేద్కర్ విగ్రహనికి పూల మాల వేసి తెలంగాణ తల్లి చిత్ర పటానికిిి పాలాభిషేకం చేశారు. అనంతరం హుస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పనులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ .. కేసీఆర్ కుటుంబం పై కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు లో కే సి ఆర్ చేసిన త్యాగన్ని తెలంగాణ ప్రజలు ఎప్పటికి మర్చిపోలేరు ఇప్పటికైన కాంగ్రెస్ పార్టీ కే సి ఆర్ గారి పై అనవసరపు విమర్శలు మానుకొని రాష్ట్ర న్ని అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సుద్దాల చంద్రయ్య, పట్టణ అధ్యక్షులు ఎమ్ ఏ అన్వర్ పాషా, మాజీ మున్సిపల్ చైర్మన్ ఆకుల రజిత వెంకట్ , సీనియర్ నాయకులు కన్నోజు రామకృష్ణ వంగ వెంకట్ రాం రెడ్డి గుళ్ళ రాజు అయూబ్ బొజ్జ హరీష్ వాల నవీన్ ఇంద్రల సారయ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.



