సీఐ జానకిరామ్ రెడ్డి
నవతెలంగాణ – పాలకుర్తి
గ్రామ పంచయతీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఎన్నికల ప్రవర్తన నియమావళిని పాటించాలని పాలకుర్తి సీఐ వంగాల జానకిరామ్ రెడ్డి గ్రామస్తులకు సూచించారు. మంగళవారం మండలంలోని వల్మీడీ క్లస్టర్ను సందర్శించి క్లస్టర్ పరిధిలో గల గ్రామాల సర్పంచులు, వార్డు సభ్యులుగా పోటీ చేసే అభ్యర్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సిఐ జానకిరామ్ రెడ్డి మాట్లాడుతూ.. గ్రామపంచాయతీ ఎన్నికల్లో సర్పంచులుగా, వార్డు సభ్యులుగా పోటీ చేసే అభ్యర్థులు ఎన్నికల ప్రవర్తన నియమావళికి అనుగుణంగా మెదులుకోవాలని సూచించారు. ప్రజలందరూ స్వచ్ఛందంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. గొడవలకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది వల్లాల రాజ్ కుమార్, వెంకటరమణ, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
అభ్యర్థులు ఎన్నికల ప్రవర్తన నియమావళిని పాటించాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



