ఆది పినిశెట్టి హీరోగా నటిస్తున్న థ్రిల్లర్ మూవీ ‘డ్రైవ్’. మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్. భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై ప్రొడ్యూసర్ వి.ఆనంద్ ప్రసాద్ నిర్మించారు. జెనూస్ మొహమద్ దర్శకత్వం వహించారు. ఈ నెల 12న ఈ సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రాబోతోంది. ఈ నేపథ్యంలో మంగళవారం ఈ సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేశారు.
ప్రజా మీడియా కార్పొరేషన్ సౌతిం డియాలో పేరున్న మీడియా సంస్థ. ఈ సంస్థ అధిపతి జే (ఆది పినిశెట్టి) తన ఫియాన్సే (మడోన్నా సెబాస్టియన్)తో కలిసి లండన్‌లో స్థిరపడాల నుకుంటాడు. ఇంతలో అతని సంస్థ అక్కౌంట్స్‌ను ఓ హ్యాకర్ హ్యాక్ చేస్తాడు. జే ప్రతి మూమెంట్ గమనిస్తూ అతన్ని చంపేస్తానని బెదిరి స్తుంటాడు. ప్రజా మీడియా కార్పొరేషన్‌కు సంబంధించిన ప్రతి విషయాన్ని ఆన్‌లైన్‌లో ఉంచుతూ ఆ సంస్థ పరువు, గౌరవాన్ని రోడ్డున పడేస్తాడు. తన పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్‌తో ఆడుకుంటున్న ఆ హ్యాకర్ ఆట కట్టించేందుకు సిద్ధమవుతాడు జే. ఆ హ్యాకర్ ఎవరు?, జే అతన్ని పట్టుకున్నాడా లేదా అనేది ట్రైలర్‌లో ఆసక్తికరంగా చూపించారు. యాక్షన్, ఎమోషన్స్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో ఉన్న ఈ ట్రైలర్ సినిమాపై అంచనాలను బాగా పెంచింది.
థ్రిల్ చేసే ‘డ్రైవ్’
- Advertisement -
- Advertisement -



