Wednesday, December 10, 2025
E-PAPER
Homeసినిమాసంక్రాంతి కానుకగా రిలీజ్‌

సంక్రాంతి కానుకగా రిలీజ్‌

- Advertisement -

హీరో శర్వా నటిస్తున్న ఫీల్‌-గుడ్‌ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌ ‘నారి నారి నడుమ మురారి’. రామ్‌ అబ్బరాజు దర్వకుడు. అడ్వెంచర్స్‌ ఇంటర్నేషనల్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సహకారంతో ఎకె ఎంటర్టైన్మెంట్స్‌ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర నిర్మించిన ఈ చిత్రంలో సంయుక్త, సాక్షి వైద్య కథానాయికలుగా నటించారు. తాజాగా రిలీజ్‌ గురించి మేకర్స్‌ అప్‌డేట్‌ ఇచ్చారు.
ఈ సంక్రాంతికి జనవరి 14న విడుదల కానుంది. ప్రీమియర్‌ షో సమయం – సాయంత్రం 5:49 అని మేకర్స్‌ ప్రకటించారు. సాధారణంగా సినిమాలు ఉదయం లేదా తెల్లవారుజాము షోలతో ప్రారంభమవుతాయి. కానీ మొదటిసారిగా ఈ సినిమా సాయంత్రం రిలీజ్‌ అవుతోంది. శర్వా గత సంక్రాంతి బ్లాక్‌బస్టర్‌లు ‘శతమానం భవతి, ఎక్స్‌ప్రెస్‌ రాజా’ కూడా జనవరి 14న విడుదలయ్యాయి అని చిత్ర యూనిట్‌ తెలిపింది.
ఈ చిత్రానికి కథ: భాను బోగవరపు, డైలాగ్స్‌: నందు సవిరిగాన, డీఓపీ : జ్ఞాన శేఖర్‌, యువరాజ్‌, సంగీతం: విశాల్‌ చంద్ర శేఖర్‌, సహ నిర్మాత: అజరు సుంకర, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: కిషోర్‌ గరికిపాటి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -