Wednesday, December 10, 2025
E-PAPER
Homeసినిమాప్యూచర్‌ సిటీలో స్టూడియోల ఏర్పాటుకు సహకారం అందిస్తాం

ప్యూచర్‌ సిటీలో స్టూడియోల ఏర్పాటుకు సహకారం అందిస్తాం

- Advertisement -

-సీఎం రేవంత్‌ రెడ్డి
‘రాష్ట్రంలో తెలుగు చిత్ర పరిశ్రమ అభివృద్ధికి కావాల్సిన అన్ని రకాల సౌకర్యాలను కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉంది’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు.
తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌లో భాగంగా మంగళవారం ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డితో సినీ ప్రముఖులు సమావేశమయ్యారు. ఈ సెషన్‌లో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి కోమటి రెడ్డి వెంకట్‌ రెడ్డి, నిర్మాతలు అల్లు అరవింద్‌, సురేష్‌ బాబు, దిల్‌ రాజు, జెనీలియా, అక్కినేని అమలతోపాటు పలువురు టాలీవుడ్‌, బాలీవుడ్‌ ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో సినీ పరిశ్రమ అభివృద్ధికి సంబంధించి పలు విషయాలను సినీ ప్రముఖులతో సీఎం చర్చించారు.ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ, ‘ఫ్యూచర్‌ సిటీలో సినీ స్టూడియోల ఏర్పాటుకు సహకారం అందిస్తాం. అలాగే ఫ్యూచర్‌ సిటీలో స్కిల్స్‌ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తాం. అలాగే 24 క్రాఫ్ట్స్‌లో సినిమా ఇండిస్టీ అవసరాలకు అనుగుణంగా స్థానికులను ట్రైన్‌ చేసే అంశాన్ని పరిశీలించాలని అధికారులకు సూచించాం. అన్నింటికి మించి స్క్రిప్ట్‌తో వస్తే సినిమా పూర్తి చేసుకుని వెళ్ళేలా రాష్ట్ర ప్రభుత్వం సినీ ఇండిస్టీని ప్రోత్సహించేందుకు సిద్ధంగా ఉంది’ అని తెలిపారు.
తెలంగాణ రైజింగ్‌ 2047 విజన్‌ డాక్యుమెంట్‌లో తెలుగు చిత్ర పరిశ్రమ అభివృద్ధికి సముచిత స్థానం కల్పించారు. ఇందులో ముఖ్యంగా సినిమాకి ఉన్న అవసరాలకు సంబంధించి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సింగిల్‌ విండో విధానం ఉండేలా ఏర్పాటు చేయటం, అత్యాధునిక సాంకేతికను స్వాగతించడం, ఫిల్మ్‌ టూరిజం, తద్వారా అంతర్జాతీయంగా మార్కెట్‌ను విస్తరించడం, సినిమాకి సంబంధించి ప్రొడక్షన్‌, పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాల కోసం వరల్డ్‌ క్లాస్‌ ఇన్‌ఫ్రాస్టక్చర్‌ కలిగి ఉండేలా చూడటం, నూతన ప్రతిభను ప్రోత్సహించడం, వారికి తగిన శిక్షణ ఇవ్వడం వంటి తదితర అంశాలను ప్రముఖంగా ప్రస్తావించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -