Wednesday, December 10, 2025
E-PAPER
Homeసినిమాఆ ఆసక్తి.. హద్దులు దాటితే?

ఆ ఆసక్తి.. హద్దులు దాటితే?

- Advertisement -

ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌ జీ5 మరోసారి తనదైన శైలిలో విలక్షణమైన తెలుగు ఒరిజినల్‌ సిరీస్‌ ‘నయనం’తో అలరించనుంది. వరుణ్‌ సందేశ్‌, ప్రియాంక జైన్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సిరీస్‌లో అలీ రెజా, ఉత్తేజ్‌, రేఖా నిరోషా తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ ఒరిజినల్‌ జీ5లో ఈనెల 19 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. ఈ సీట్‌ ఎడ్జ్‌ సైకో థ్రిల్లర్‌ను స్వాతి ప్రకాశ్‌ డైరెక్ట్‌ చేశారు. మంగళవారం ‘నయనం’ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ జరిగింది.
ఈ వేడుకలో మ్యూజిక్‌ డైరెక్టర్‌ అజరు అరసాడ, ఎడిటర్‌ వెంకట కష్ణ, సినిమాటోగ్రాఫర్‌ షోయబ్‌ సిద్ధికీ, అలీ రెజా, డైరెక్టర్‌ రాజేష్‌, డైరెక్టర్‌ శేఖర్‌, జీ 5 తెలుగు సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ జయంత్‌ రాఘవన్‌, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ విద్యాసాగర్‌, జీ5 తెలుగు ఒరిజినల్‌ కంటెంట్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ సాయితేజ, జీ 5 చీఫ్‌ కంటెంట్‌ ఆఫీసర్‌, బిజినెస్‌ హెడ్‌ అనూరాధ, ప్రియాంక జైన్‌, వితికా శేరు తదితరులు పాల్గొన్నారు.
నిర్మాత రజినీ తాళ్లూరి మాట్లాడుతూ,’లాస్ట్‌ ఇయర్‌ ఇదే టైమ్‌కి ‘వికటకవి’ రిలీజైంది. బ్లాక్‌బస్టరైంది. జీ5తో కలసి చేస్తోన్న మూడో ప్రాజెక్ట్‌ ఇది. మంచి కంటెంట్‌తో మరోసారి ప్రేక్షకుల ముందుకొస్తున్నాం’ అని అన్నారు.
‘పది మందిలో ఎడెనిమిది మంది పక్కవారి లైఫ్‌లో ఏం జరుగుతోంది అని తెలుసుకోవాలనే కుతూహలం ఉంటుంది. అలాంటి క్యూరియాసిటీ పీక్స్‌లో ఉంటే ఏం జరుగుతుందనేదే ఈ సిరీస్‌’ అని డైరెక్టర్‌ స్వాతి ప్రకాష్‌ చెప్పారు.
వరుణ్‌ సందేశ్‌ మాట్లాడుతూ,”శేఖర్‌ ఈ స్టోరీ గురించి చెప్పారు. స్వాతి, సాధిక ఇచ్చిన నెరేషన్‌ వినగానే షాకింగ్‌లో ఉండిపోయాను. ఏం ఆలోచించకుండా ఎలాగైనా నయన్‌ క్యారెక్టర్‌ చేయాలని డిసైడ్‌ అయిపోయాను. జీ5 టీమ్‌ ఇలాంటి ఓ వండర్ఫుల్‌ ప్రాజెక్ట్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తుండటం గొప్ప విషయం. ఎస్‌ఆర్‌టి ఎంటర్‌టైన్‌మెంట్‌ రామ్‌, రజినీకి థ్యాంక్స్‌’ అని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -