Wednesday, December 10, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంప్రకృతి పరిరక్షణ, జీవనోపాధి పెంపు లక్ష్యాలుగా..

ప్రకృతి పరిరక్షణ, జీవనోపాధి పెంపు లక్ష్యాలుగా..

- Advertisement -

ఎకో టూరిజం అభివృద్ధిపై సమ్మిట్‌లో మంత్రి కొండా సురేఖ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

ప్రకృతి పరిరక్షణతో పాటు స్థానికులకు జీవనోపాధి పెంపు లక్ష్యాలుగా ఎకో టూరిజంను అభివృద్ధి చేయనున్నట్టు రాష్ట్ర అటవీ, దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ తెలిపారు. మంగళవారం తెలంగాణ రైజింగ్‌ -2047 గ్లోబల్‌ సమ్మిట్‌లో ఆమె ఎకో టూరిజంపై మాట్లాడారు. రాష్ట్రంలో ప్రస్తుతం పచ్చదనం 22 శాతం ఉందనీ, సరస్సులు, గడ్డి భూములు, జాతీయ ఉద్యానవనాలు, అమ్రాబాద్‌-కవ్వాల్‌ వంటి ప్రముఖ టైగర్‌ రిజర్వులతో రాష్ట్రం సహజ సిద్ధమైన సంపద ఉన్నదని తెలిపారు. 7,200 చ.కి.మీ విస్తీర్ణంలో ఉన్న రక్షిత వన్యప్రాంతాలు, సహజసిద్ధమైన ప్రకృతి, ఎకో టూరిజం అభివద్ధికి విస్తృతమైన అవకా శాలు కల్పిస్తున్నదన్నారు. పర్యాటక విధానం 2025-30, ఎకో టూరిజం ఫ్రేమ్‌వర్క్‌ను ప్రవేశపెట్టి, తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థను నోడల్‌ ఏజెన్సీగా నిర్ణయించినట్టు తెలిపారు. ‘తక్కువ నిర్మాణాలు-ఎక్కువ అనుభవం” అన్న నినాదంతో పర్యావరణానికి హానీ లేకుండా సందర్శకులకు వన్యప్రదేశ అనుభవం అందిం చడమే ఈ స్లోగన్‌ ప్రధాన ఉద్దేశమని వివరించారు. ప్రయివేటు రంగంతో కలిసి కొత్త ప్రాజెక్టులు చేపట్టేందుకు ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని స్పష్టం చేశారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు ఉద్యోగాలు, శిక్షణ, హాస్పిటాలిటీ నైపుణ్యాలు అందించడం ద్వారా ఎకో టూరిజాన్ని సమగ్ర అభివృద్ధి దిశగా తీసుకెళుతున్నట్టు తెలిపారు. రాష్ట్రంలో 13 ఎకో టూరిజం సర్క్యూట్లు ఏర్పాటు చేయగా, రామప్ప-శ్రీశైలం వంటి వారసత్వ-ఆధ్యాత్మిక కేంద్రాలను ప్రకృతి పర్యాటకంతో అనుసంధా నిస్తున్నట్టు తెలిపారు. ”డెక్కన్‌ ఉడ్స్‌ అండ్‌ ట్రెయిల్స్‌ ” పేరుతో రాష్ట్ర ఎకో టూరిజం బ్రాండ్‌ను ప్రారంభించి నట్టు ప్రకటించారు. అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వులో పులుల సంఖ్య గణనీయంగా పెరిగి 2024 నాటికి 36కు చేరుకోవడం వాటి సంరక్షణలో రాష్ట్ర విజయాన్ని ప్రతిబింబిస్తోందని మంత్రి వెల్లడించారు. నందిపేట, తాడ్వాయి, పాఖాల్‌ వంటి కొత్త ఎకోటూరిజం ప్రదేశాలు అభివృద్ధి దశలో ఉన్నాయి. త్వరలో గైడెడ్‌ ఫారెస్టు ట్రెక్కులు, ఆన్‌లైన్‌ బుకింగ్‌ యాప్‌ కూడా అందుబాటు లోకి రానున్నదని చెప్పారు. ఎకో టూరిజం ద్వారా 2047 నాటికి నెట్‌ జీరో లక్ష్యాలను చేరేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తున్నదని మంత్రి కొండా సురేఖ వెల్లడించారు.
టెంపుల్‌ టూరిజం కోసం 4 సర్క్యూట్లు
రాష్ట్రంలో టెంపుల్‌ టూరిజం ప్రోత్సహించేందుకు 4 సర్క్యూట్లలో అన్ని దేవాలయాలను అభివృద్ధి చేయను న్నట్టు మంత్రి కొండా సురేఖ తెలిపారు. దేవాదాయ శాఖలో 12,434 దేవాలయాలు ఉండగా, 695 దేవాలయాలు ఆదాయము కలిగి ఉన్నాయనీ, దాదాపు 3,505 దేవాలయాలకు, ఆయా దేవాలయాలకు కలిగినటువంటి భూముల ద్వారా వచ్చేటువంటి ఆదాయాల ద్వారా, దేవాదాయశాఖ ద్వారా నిర్వహిసు ్తన్నట్టు ఆమె వివరించారు. ఎటువంటి ఆదరణకు నోచుకోనటువంటి 6,439 దేవాలయాలకు నిత్య ధూప దీప నైవేద్యం నిమిత్తం ప్రభుత్వం ఆర్ధిక సహాయం అందిస్తున్నట్టు చెప్పారు. శిథిలావస్థలో ఉన్న దేవాలయాల పునరుద్ధరణకై సీజీఎఫ్‌ ద్వారా నిధులు కేటాయిస్తూ, వెనకబడిన వర్గాల ప్రాంతాల్లో ఆలయాలను నిర్మిస్తున్నట్టు తెలిపారు. అవసరంలో ఉన్న అర్చకులకు సందర్భాన్ని బట్టి ఆర్థిక సహకారాన్ని అందిస్తున్నట్టు తెలిపారు. రాష్ట్ర పండుగగా బతుకమ్మ పండుగను నిర్వహిస్తూ, ఐదు రాష్ట్రాల భక్తులు పాల్గొనే సమ్మక్క, సారలమ్మ జాతర, మేడారం అభివృద్ధికి శాశ్వత ప్రాతిపదికన నిర్మాణాలు చేపట్టి, సరస్వతి పుష్కరాలను ఘనంగా నిర్వహించినట్టు తెలిపారు. 2027 గోదావరి పుష్కరాల కోసం భక్తుల సౌకర్యార్థం కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసినట్టు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -