Wednesday, December 10, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంఆవిష్కరణలే ఆర్థిక వ్యవస్థకు కీలకం

ఆవిష్కరణలే ఆర్థిక వ్యవస్థకు కీలకం

- Advertisement -

– అప్పుడే 3 ట్రిలియన్‌ డాలర్ల ఎకనామి
– రైతులకు ఏఐ ఉపయోగపడాలి : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
నవ తెలంగాణ – బిజినెస్‌ బ్యూరో

ఆర్థిక వ్యవస్థకు పెట్టుబడులు సహా ఆవిష్కర ణలు అత్యంత కీలకమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. కృత్రిమ మేధ (ఏఐ), ఆధునిక సాంకేతికత రైతుల ఉత్పత్తులు పెంచేందుకు ఉపయో గపడాలని సూచించారు. తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిటిలో ఏర్పాటు చేసిన ‘క్యాపిటల్‌ అండ్‌ ప్రొడక్ట విటీ’ చర్చావేదికలో మంత్రి భట్టి మాట్లాడుతూ.. వచ్చే 22 ఏండ్లలో నిర్దేశించుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలంటే ప్రస్తుతం ఉన్న అంచనాల ప్రకారం లెక్కిస్తే 16 రెట్ల ఆర్థిక వృద్ధిని సాధించాల్సి ఉందని విశ్లేషించారు. ”మేము ‘తెలంగాణ రైజింగ్‌ 2047’ను ఆవిష్కరిం చాము. ఇది కేవలం ఒక పత్రం కాదు. ఇది భవి ష్యత్‌కు ఇచ్చిన ప్రతిజ్ఞ. 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా నిలపడం అనే మహత్తర లక్ష్యాన్ని నిర్ణయించుకున్నాం.” అని భట్టి విక్రమార్క అన్నారు.
మనం ఎక్కువగా పనిచేస్తేనే మూడు ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థను చేరుకోలేమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. మరిన్ని రోడ్లు, పెద్ద సంఖ్యలో భవనాలు నిర్మించడం మాత్రమే సరిపోద న్నారు. మౌలిక సదుపాయాలను అందుబాటులోకి తెచ్చినప్పటికీ.. ఈ విప్లవాత్మక వృద్ధిని సాధించాలంటే మన ఆర్థిక వ్యవస్థ ప్రాథమిక సమీకరణాలు మారాల న్నారు. మూలధనం, ఆవిష్కరణ కలిపితే ఉత్పాదకత గా మారుతుందన్నారు. ఉత్పాదకత ద్వారానే తెలం గాణ సాధారణపౌరుడి వేతనాలు, గౌరవాన్ని శాశ్వతం గా పెంచే ఏకైకమార్గమని డిప్యూటీ సీఎం అన్నారు.

వినూత్న కల్పనల వైపు సాగాలి..
ఆసియాలో ఇన్నోవేషన్‌ క్యాపిటల్‌ కావాలంటే ‘ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌’ నుంచి ‘ఈజ్‌ ఆఫ్‌ ఇన్నోవేటింగ్‌’ వైపు సాగాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఫైళ్లు క్లియర్‌ చేయడమే కాదన్నారు. ఎకోసిస్టమ్‌లను క్రియేట్‌ చేసే ప్రభుత్వం కావాలని తెలిపారు. ‘మన దగ్గర ప్రణాళిక ఉంది. ప్రతిభ ఉంది. కానీ ఇన్నోవేషన్‌ ఖరీదైనది. ముఖ్యంగా
ఇన్నోవేషన్‌ అంటే రిస్క్‌ ఉంటుందన్నారు. మేము రెగ్యులేటర్‌గా కాకుండా, రిస్క్‌ను పంచుకునే ‘క్యాటలిస్ట్‌’గా మారడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. ప్రజల కోసం రివార్డులు పొందే భాగస్వామిగా మారడానికి సిద్ధంగా ఉన్నాం అని అన్నారు.

డీప్‌టెక్‌ సైబరాబాద్‌లోనే కాకుండా, వరంగల్‌, నిజామాబాద్‌ రైతుల ఉత్పాదకత పెంచే ‘బోరింగ్‌ ప్రాబ్లమ్స్‌’ను కూడా ఎలా పరిష్కరించేలా చేసుకోవాలనే దానిపై దృష్టి పెట్టాలని ఆయన పెట్టుబడిదారులకు సూచించారు. ఈ రంగాల్లో మూలధనాన్ని ఎలా ఆకర్షించాలనే దానిపై దృష్టి పెట్టాలన్నారు. ఈ చర్చాగోష్టిలో సెంటర్‌ ఫర్‌ ఎనలైటికల్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ ప్రసన్న తంత్రి, యువ పారిశ్రామికవేత్త పరశురాం, ట్రాన్స్‌ కో సీఎండీ కృష్ణ భాస్కర్‌ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -