Wednesday, December 10, 2025
E-PAPER
Homeఆటలుభారత మహిళల జట్టులోకి కమలిని, వైష్ణవి

భారత మహిళల జట్టులోకి కమలిని, వైష్ణవి

- Advertisement -

శ్రీలంక టీ20 సిరీస్‌కు జట్టు ప్రకటన
న్యూఢిల్లీ:
శ్రీలంకతో స్వదేశంలో జరగనున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ కోసం భారత మహిళల క్రికెట్‌ జట్టును మంగళవారం ప్రకటించారు. ఈసారి జట్టులో ఇద్దరు యువ క్రీడాకారిణులకు తొలిసారిగా చోటు దక్కింది. ముంబై ఇండియన్స్‌ తరఫున మహిళల ప్రీమియర్‌ లీగ్‌ లో ఆడిన 17 ఏళ్ల వికెట్‌ కీపర్‌-బ్యాటర్‌ గునలన్‌ కమలిని, 19 ఏళ్ల యువ ప్లేయర్‌ వైష?వి శర్మ భారత జట్టులోకి కొత్తగా వచ్చారు. వీరు ఇద్దరూ గత నెలలో జరిగిన వన్డే ప్రపంచ కప్‌లో విజయం సాధించిన జట్టులో ఉన్న రాధా యాదవ్‌, ఉమా ఛెత్రి స్థానంలో చోటు దక్కించుకున్నారు. ఈ సిరీస్‌కు హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ కెప్టెన్‌గా, స్మ తి మంధాన వైస్‌ కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వర్తించనున్నారు. వీరితో పాటు దీప్తి శర్మ, స్నేహ్‌ రాణా, జెమీమా రోడ్రిగ్స్‌, పవర్‌ హిట్టర్‌ షఫాలీ వర్మ వంటి సీనియర్లు కూడా బరిలో నిలిచారు. ఈ ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ 21న ప్రారంభమై 30వ తేదీ వరకు జరుగుతుంది. తొలి రెండు మ్యాచ్‌లకు విశాఖపట్నం ఆతిథ్యం ఇవ్వనుండగా.. చివరి మూడు మ్యాచ్‌లను కేరళలోని తిరువనంతపురంలో నిర్వహిస్తారు. గతేడాది అక్టోబర్‌లో ప్రపంచ కప్‌లో భారత్‌, శ్రీలంక చివరిసారిగా టీ20 ఫార్మాట్‌లో తలపడ్డాయి.

భారత జట్టు
హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (కెప్టెన్‌), స్మ తి మంధాన (వైస్‌ కెప్టెన్‌), దీప్తి శర్మ, స్నేహ్‌ రాణా, జెమీమా రోడ్రిగ్స్‌, షఫాలీ వర్మ, హర్లీన్‌ డియోల్‌, అమన్‌జోత్‌ కౌర్‌, అరుంధతి రెడ్డి, క్రాంతి గౌడ్‌, రేణుక సింగ్‌ ఠాకూర్‌, రిచా ఘోష్‌ (కీపర్‌), జి. కమలిని (కీపర్‌), శ్రీ చరణి, వైష్ణవి శర్మ.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -