Wednesday, December 10, 2025
E-PAPER
Homeఆటలుముంబైలో మెస్సీ ర్యాంప్‌ వాక్‌!

ముంబైలో మెస్సీ ర్యాంప్‌ వాక్‌!

- Advertisement -

కోల్‌కతా: అర్జెంటీనా ఫుట్‌బాల్‌ దిగ్గజం లియోనల్‌ మెస్సీ భారత పర్యటనపై కోసం అభిమానులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ‘గోట్‌ ఇండియా టూర్‌’ పేరిట జరిగే ఈ పర్యటనలో భాగంగా మెస్సీ ముంబైలో ర్యాంప్‌ వ్యాక్‌ చేస్తాడని నిర్వాహకుడు శతద్రు దత్తా మంగళవారం తెలిపారు. గోట్‌ టూర్‌లో మెస్సీ హైదరాబాద్‌, ముంబై, కోల్‌కతా, ఢిల్లీ నగరాల్లో పలు ఆసక్తికర కార్యక్రమాల్లో పాల్గొంటాడు. ఈ నెల 13న హైదరాబాద్‌లోని ఉప్పల్‌ స్టేడియంలో జరిగే ‘గోట్‌ కప్‌’ ఈవెంట్‌కు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డితో కలిసి హాజరుకానున్నాడు. ఇందులో 7 వర్సెస్‌ 7 సెలబ్రిటీ మ్యాచ్‌ ఆడనున్నాడు. అంతేకాకుండా, యువ ప్రతిభావంతులైన ఆటగాళ్లకు మెస్సీ మాస్టర్‌ క్లాస్‌ నిర్వహించడంతో పాటు పెనాల్టీ షఉటౌట్స్‌ ఆడతాడని నిర్వాహకులు వెల్లడించారు. . ఈ సందఠంగా మెస్సీ కోసం ప్రత్యేకంగా సంగీత కచేరి కూడా ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌ పర్యటన తర్వాత మెస్సీ ముంబైకి బయలుదేరతాడు. అక్కడ సామాజిక సేవ కోసం నిర్వహించే చారిటీ కార్యక్రమంలో మెస్సీ ర్యాంప్‌పై నడవనున్నాడు. తన చిరకాల సహచరుడు అయిన లూయిస్‌ సురెజ్‌, అర్జెంటీనా మిడ్‌ఫీల్డర్‌ రోడ్రిగో డిపాల్‌తో కలిసి 45 నిమిషాల పాటుమెస్సీ పాల్గొంటాడని శతద్రు దత్తా తెలిపారు. ఈ వేడుకకుబాలీవుడ్‌ నటులు టైగర్‌ ష్రాఫ్‌, జాకీ ష్రాఫ్‌, జాన్‌ అబ్రహంతో పాటు పలువురు ప్రముఖులు, సెలబ్రిటీ క్రికెటర్లు, పారిశ్రామికవేత్తలు హాజరుకానున్నారు. ఈ సందఠంగా సురెజ్‌ స్పానిష్‌ మ్యూజిక్‌ షోలో కూడా పాల్గొంటాడు. అలాగే, 2022 ప్రపంచ కప్‌లో అర్జెంటీనా విజయాన్ని సూచించే ప్రత్యేక వస్తువులను వేలం వేయడం కోసం తీసుకు రావాలని మెస్సీని కోరినట్టు నిర్వాహకులు తెలిపారు. హైదరాబాద్‌కు రాకముందు కోల్‌కతాలో మెస్సీ 70 అడుగుల ఎత్తు ఉన్న తన విగ్రహాన్ని భద్రతా కారణాల వల్ల తాను బస చేసే హౌటల్‌ నుంచే వర్చువల్‌ గా ఆవిష్కరిస్తాడు. మెస్సీ తన పర్యటన చివరి రోజున, సోమవారం ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఆయన నివాసంలో కలుస్తారని నిర్వాహకులు వెల్లడించారు. కాగా, 2011 తర్వాత మెస్సీ భారత్‌లో పర్యటించడం ఇదే మొదటిసారి కావడం విశేషం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -