Wednesday, December 10, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంమార్చి 14 నుంచి టెన్త్‌ పరీక్షలు

మార్చి 14 నుంచి టెన్త్‌ పరీక్షలు

- Advertisement -

షెడ్యూల్‌ విడుదల
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

రాష్ట్రంలో పదో తరగతి వార్షిక పరీక్షల షెడ్యూల్‌ విడుదలైంది. మార్చి 14 నుంచి ఏప్రిల్‌ 16 వరకు ఈ పరీక్షలు జరుగు తాయని బోర్డ్‌ ఆఫ్‌ సెకెండెరీ ఎడ్యుకేషన్‌ ఈ మేరకు మంగళవారం ప్రకటించింది. అన్ని జిల్లాల డీఈవోలు, విద్యాసంస్థల ప్రతినిధులు ఈ షెడ్యూల్‌ను ఎస్‌ఎస్‌సీ రెగ్యులర్‌, ఓఎస్‌ఎస్‌సీ, ఒకేషనల్‌ కోర్సులు చదివే ప్రతి విద్యార్థికీ తెలియజేయాలని సూచించింది. ప్రతి రోజు ఉదయం 9.30గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్షలు నిర్వహించ నున్నారు. షెడ్యూల్‌ వివరాలిలా ఉన్నాయి. మార్చి 14 ఫస్ట్‌ లాంగ్వేజ్‌, 18న సెకెండ్‌ లాంగ్వేజ్‌, 23న థర్డ్‌ లాంగ్వేజ్‌, 28న గణితం, ఏప్రిల్‌ 2న సైన్స్‌ (పార్ట్‌ -1) – భౌతిక శాస్త్రం, 7న – సైన్స్‌ – పార్ట్‌ 2 – బయోలాజికల్‌ సైన్స్‌, 13న సాంఘిక శాస్త్రం, 15న ఓఎస్‌ఎస్‌సీ మెయిన్‌ లాంగ్వేజ్‌ పేపర్‌ -1బీ ఎస్‌ఎస్‌సీ ఒకేషనల్‌ కోర్సు (థియరీ), 16న ఓఎస్‌ఎస్‌సీ మెయిన్‌ లాంగ్వేజ్‌ పేపర్‌ -2 పరీక్షలు
(మొదటిపేజీ తరువాయి)
జరగనున్నాయి.
పరీక్షల షెడ్యూల్‌ మార్చాలి..:డీటీఎఫ్‌
ప్రభుత్వ పరీక్షల విభాగం విడుదల చేసిన పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ పూర్తిగా అసంబద్ధంగా ఉందని వెంటనే మార్పు చేయాలని డెమోక్రటిక్‌ టీచర్స్‌ ఫెడరేషన్‌ (డీటీఎఫ్‌) రాష్ట్ర అధ్యక్షులు ఎం.సోమయ్య, ప్రధాన కార్యదర్శి టి.లింగారెడ్డిలు కోరారు. ఈ మేరకు మంగళవారం వారు ఒక ప్రకటన విడుదల చేశారు. దాదాపు నెల రోజులపాటు పదో తరగతి షెడ్యూల్‌ విడుదల చేయడం ద్వారా విద్యార్థులు మానసికంగా ఇబ్బంది పడతారని వారు ఆందోళన వ్యక్తం చేశారు. అదేవిధంగా 10వ తరగతి పరీక్షల ప్రభావం ఇతర పరీక్షలపై కూడా ఉండే అవకాశం ఉందని తెలిపారు. పరీక్షకు పరీక్షకు మధ్య ఒకరోజు వ్యవధితో పరీక్ష నిర్వహిస్తే సరిపోతుందని పేర్కొన్నారు.
పరీక్షల నిర్వహణ ప్రయోగాత్మకమే..: ఎస్టీయూటీస్‌
ఎస్సెస్సీ పరీక్షలు నెల రోజులకు పైగా నిర్వహించడం సరి కాదని ఎస్టీయూటీస్‌ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు జి.సదానందం గౌడ్‌, జుట్టు గజేందర్‌ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. 33 రోజుల పాటు పరీక్షలు నిర్వహించడం ప్రయోగాత్మకంగా ఉందని పేర్కొన్నారు. విద్యార్థులు ఆందోళన చెందుతారని, పరీక్షల టైమ్‌ టేబుల్‌ ను సవరించి, పది రోజుల్లో పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రశ్నా పత్రాలు భద్రపరచడం, మూల్యాంకన ప్రక్రియలపై ప్రభావం చూపే అవకాశం ఉందని తెలిపారు. ఏప్రిల్‌లో ఎండలు తీవ్రంగా ఉండడంతో విద్యార్థులు పరీక్షలు రాయడంలో ఇబ్బంది పడతారని చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -