నవతెలంగాణ-హైదరాబాద్: కటక్‌లోని బారాబతి స్టేడియంలో జరిగిన మొదటి టి20లో భారత్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. దక్షిణాఫ్రికాపై 101 పరుగుల తేడాతో టీమిండియా గెలుపోందింది. ఈ మ్యాచ్ లో ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా రెండు వికెట్లు పడగొట్టాడు. దీనితో జస్ప్రీత్ బుమ్రా అరుదైన ఘనతను సాధించాడు. మూడు ఫార్మాట్లలో 100 వికెట్లు తీసిన తొలి భారత బౌలర్‌గా నిలిచాడు. అంతేకాకుండా, ఈ ఘనత సాధించిన ప్రపంచంలో ఐదవ బౌలర్‌గా నిలిచాడు. ఇప్పటివరకు ఏ భారత బౌలర్ కూడా ఈ ఘనతను సాధించలేదు. ఈ మ్యాచ్‌లో బుమ్రా మూడు ఓవర్లు బౌలింగ్ చేసి 17 పరుగులిచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు.
బుమ్రా తన కెరీర్‌లో ఇప్పటివరకు 52 టెస్టుల్లో 99 ఇన్నింగ్స్‌ల్లో 19.79 సగటు, 2.77 ఎకానమీతో 234 వికెట్లు పడగొట్టాడు. ఈ భారత ఫాస్ట్ బౌలర్ 89 వన్డేల్లో 88 ఇన్నింగ్స్‌ల్లో 149 వికెట్లు పడగొట్టాడు. 81 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో 101 వికెట్లు పడగొట్టాడు. టీ 20 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్లలో బుమ్రా రెండవ స్థానంలో ఉన్నాడు, అర్ష్‌దీప్ సింగ్ మొదటి స్థానంలో ఉన్నాడు.



