Wednesday, December 10, 2025
E-PAPER
Homeజాతీయంఆ రాష్ట్ర ఎమ్మెల్యేల జీతాలు మూడు రేట్లు పెంపు

ఆ రాష్ట్ర ఎమ్మెల్యేల జీతాలు మూడు రేట్లు పెంపు

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: ఒడిశాలో అసెంబ్లీ సభ్యుల నెలవారీ జీతాన్ని మూడు రెట్లు పెరిగాయి. గ‌తంలో నెలకు రూ. రూ.1.11ల‌క్ష‌లు ఉండ‌గా..ప్ర‌స్తుతం రూ.3.45 లక్షల‌కు పెంచారు. మంగళవారం ఒడిశా అసెంబ్లీ ఈ బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించింది. దీని తర్వాత, ఒడిశా ఎమ్మెల్యేలు దేశంలో అత్యధిక జీతం పొందేవారి లిస్ట్ లో చేరారు. పెరిగిన జీతాలు 17వ అసెంబ్లీ ఏర్పడిన జూన్ 2024 నుండి అమల్లోకి వస్తాయని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ముఖేష్ మహాలింగ్ తెలిపారు.

ప్రస్తుతం, ఒడిశా అసెంబ్లీలో ఒక సాధారణ ఎమ్మెల్యే జీతం, అలవెన్సులు, ఇతర ఆర్థిక ప్రయోజనాలతో సహా నెలవారీ జీతం ప్యాకేజీని సుమారు రూ.1.11 లక్షలు పొందుతున్నారు. ఇప్పుడు, ప్యాకేజీ రూ. 345,000 అవుతుంది. ఇది ఎమ్మెల్యేలకు దాదాపు 3.10 రెట్లు పెరుగుదల, 2007 నుండి సభ్యులు జీతాల పెంపు డిమాండ్ చేస్తున్నారు. ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేల జీతాలు, పెన్షన్లను పెంచే నాలుగు బిల్లులను ఆమోదించినందుకు సభ్యులందరూ ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -