Wednesday, December 10, 2025
E-PAPER
Homeఆదిలాబాద్ఓక్క సారి పోటీ.. రెండవ సారి ఏకగ్రీవం

ఓక్క సారి పోటీ.. రెండవ సారి ఏకగ్రీవం

- Advertisement -

– ఎడ్ బిడ్ తాండ సర్పంచ్ గా దూమానాయక్
నవతెలంగాణ -ముధోల్ : గత సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసి ఒక్క ఓటుతో గెలుపొందిన సర్పంచ్ , తాజాగా మళ్లీ సర్పంచ్ ఎన్నికల్లో ఏకగ్రీవంగా సర్పంచ్ గా ఎన్నికైన సంఘటన ముధోల్ మండలంలోని ఎడ్ బిడ్ తాండ గ్రామంలో జరిగింది. విరాల్లోకెళ్తే..  మండలంలోని  ఎడ్ బిడ్ తండా గ్రామపంచాయతీ లో  సర్పంచ్ గా జాదవ్ దూమ నాయక్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గత ఎన్నికల్లో సర్పంచ్ గా పోటీ చేసి ఒక్క ఓటుతో గెలుపొందిన ధూమ నాయక్ తాజాగా మరోసారి  పంచాయతీ ఎన్నికలు  సర్పంచ్ గా పోటీ చేయగా  ఏకగ్రీవంగా ఎన్నికై తండావాసుల అభినందనలు అందుకుంటున్నారు. అతిపిన్న వయసులోనే సర్పంచ్  ఎన్నికై, రెండో సారి కూడా సర్పంచ్ గా ఏకగ్రీవం అయ్యారు. ఈ గ్రామంలో ఏడువందల జనాభా ఉంటుంది.అయితే రాజకీయాలను పక్కనపెట్టి  గ్రామ అభివృద్ది కోసం తాండా వాసులు ఏకమై  పంచాయతీ ఎన్నికలను ఏకగ్రీవ చేయడం అభినందించదగ్గ విషయమని పలువురు పేర్కొంటున్నారు.గత సర్పంచ్ పదవి కాలంలో   తండాలో  దూమ నాయక్ సీసీ రోడ్లు, మురికి కాలువలు , తదితర అభివృద్ధి పనులను చెప్పట్టారు. దీంతో తాండవాసులు తమ గ్రామంలో ఏకగ్రీవంగా సర్పంచ్ ఎన్నుకుంటే గ్రామం మరింత అభివృద్ధి చెందుతున్న ఉద్దేశంతో రెండోసారి దూమ నాయక్ ను  ఏకగ్రీవంగా సర్పంచ్ గా ఎన్నుకున్నారు. అలాగే 8 మంది వార్డు సభ్యులను  కూడా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. దీంతో గ్రామం పంచాయతీ ఎన్నికలు ఏకగ్రీవం జరగడంతో ప్రభుత్వ నుంచి వచ్చే ప్రోత్సాహక నగదును  అందుకోనున్నారు. తమ గ్రామంలో అందరూ కలిసిమెలిసి ఉండి గ్రామ అభివృద్ధికి మరింత  కృషి  చేస్తానని సర్పంచ్ గా ఎన్నికైన ధూమ నాయక్ నవ తెలంగాణకు బుధవారం  తెలిపారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకొని గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధికి చర్యలు తీసుకుంటానని చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -