- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: గుండెల నిండా అభిమానంతో ఓయూకు వచ్చానని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. బుధవారం ఆయన ఉస్మానియా యూనివర్సిటీని సందర్శించి మాట్లాడారు. ‘‘ఆధిపత్యానికి వ్యతిరేకంగా తెలంగాణలో పోరాటాలు వచ్చాయి. సామాన్యులైన చాకలి ఐలమ్మ, దొడ్డి కొమురయ్య.. దొరలపై పోరాడారు. ఉమ్మడి రాష్ట్రంలో న్యాయం జరగలేదని తెలంగాణ ఉద్యమం వచ్చింది. ఉద్యమాన్ని ఉస్మానియా వర్సిటీ నుంచే విద్యార్థులు ప్రారంభించారు. జార్జిరెడ్డి, గద్దర్ వంటి వీరులను ఓయూ తెలంగాణకు అందించింది’’ అని రేవంత్‌రెడ్డి అన్నారు.
- Advertisement -



