- Advertisement -
నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ మండలంలోని పెద్ద షాక్కర్గ గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి విశాలాక్షి గెలుపు కోసం ముమ్మర ప్రచారం చేస్తున్నారు. విశాలాక్షి కుటుంబం రాజకీయంగా పెట్టిన పేరు. ఈ కుటుంబంలో సర్పంచిగా ఎంపీటీసీగా, ఎంపీపీగా జెడ్పీటీసీగా పదవులు చేపట్టారు. గ్రామ ప్రజలకు ఎన్నో ఏండ్లుగా సేవలు అందిస్తూ వస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్న సర్పంచ్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా దేవాదాయ ధర్మాదాయ శాఖ సలాబత్పూర్ ఆలయ కమిటీ చైర్మన్ రామ్ పటేల్ సతీమణి విశాలాక్షి పోటీ చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ అనూష బాయి, కుటుంబ సభ్యులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
- Advertisement -



