Wednesday, December 10, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఎమ్మెల్యే సహకారంతో ఆదర్శ గ్రామంగా అభివృద్ధి చేస్తా

ఎమ్మెల్యే సహకారంతో ఆదర్శ గ్రామంగా అభివృద్ధి చేస్తా

- Advertisement -

తుంగతుర్తి కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థి మెండే ముత్యాలు
నవతెలంగాణ – పెద్దవూర
తుంగతుర్తి గ్రామాన్ని అభివృద్ధి చేసేందుకు ఆశీర్వదిస్తే నాయకుడిగా కాదు.. ప్రజల సేవకుడిగా గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని తుంగతుర్తి కాంగ్రెస్ అభ్యర్థి సర్పంచ్ మెండే ముత్యాలు అన్నారు. బుధవారం వారం గ్రామంలోని పలు వార్డులలో ఇంటింటి ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికార పార్టీలో ఉన్న కాంగ్రెస్ అభ్యర్థికి ఓటు వేస్తే గ్రామ అభివృద్ధికి అడుగులు పడ్డాయన్నారు. గ్రామాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేయాలనే గొప్ప లక్ష్యంతో ఉన్న ఎంఎల్ఏ కుందూరు జయవీర్ రెడ్డి సహకారంతో గ్రామ అభివృద్ధికి అధిక నిధులు తీసుకువచ్చి మండలంలో ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని తెలిపారు. గ్రామాన్ని మినీ ట్యాంక్ బాండు గా ఏర్పాటు చేస్తా,యువతకు స్టడీ హాల్,గ్రామం లో గ్రంధాలయం ఏర్పాటు చేసి మండలం లోనే ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని తెలిపారు. గ్రామ అభివృద్ధి తమ లక్ష్యంగా గ్రామంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు గ్రామంలోని ప్రజలు కత్తెర గుర్తుపై ఓటు వేసి తమను ఆశీర్వదించాలని కోరారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -