Wednesday, December 10, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఆశీర్వదించి గెలిపిస్తే గ్రామాన్ని అభివృద్ధిలో ముందుంచుతా

ఆశీర్వదించి గెలిపిస్తే గ్రామాన్ని అభివృద్ధిలో ముందుంచుతా

- Advertisement -

నవతెలంగాణ – పెద్దవూర
తనను ఆశీర్వదించి గెలిపిస్తే గ్రామాన్ని అభివృద్ధి లో ముందు ఉంచుతామని బసిరెడ్డిపల్లి గ్రామ పంచాయతీ కాంగ్రెస్ పార్టీ సర్పంచి అభ్యర్థి పోలే లత అంజిబాబు అన్నారు. బుధవారం గ్రామం లో ఇంటింటికి తిరిగి ప్రచారం నిర్వహస్తూ మాట్లాడారు. గ్రామంలో ప్రతి ఆడబిడ్డ పెళ్ళికి గ్రామ కళ్యాణలక్షి పథకం పేరిట 5016 లు,ప్యూరీ ఫైడ్ వాటర్ ప్లాంట్ఏర్పాటు చేసి సురక్షిత మంచి నీటిని అందించడం, గ్రామంలో ప్రతి స్థంబానికి సోలార్ విద్యుత్ లైట్ ఏర్పాటు చేయండం,మన గ్రామంలో సి.సి. కెమరాల ఏర్పాటు  చేస్తామని తెలిపారు. ప్రతినెల గ్రామసభ నిర్వహించి సమస్యలను పరిష్కరించడం, ప్రతి 6 నెలలకు ఒకసారి ఉచిత హెల్త్ క్యాంప్ నిర్వహించి, ఉచితంగా మందుల పంపిణి రైతులకు ప్రతి 6 నెలలకు ఒక సారి వ్యవసాయ అధికారులతో పంటలపై అవగాహన సదస్సులు నిర్వహిస్తా మని తెలిపారు.

రేగళ్ళ స్టేజ్ నుండి సిరసనగండ్ల స్టేజ్ వరకు ఇరువైపుల చెట్లను తొలగించి బాటను వేడెల్పు చేస్తామని చెప్పారు.గ్రామంలో అసంపూర్తిగ ఉన్న సిసి. రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం పూర్తి చేస్తామని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు ఐడి కార్డులు, షూ, టై పంపిణీ చేయడం,నవోదయా మరియు గురుకుల పరీక్షలకు ఉచితంగా మెటీరియల్ అందించడం,అంగన్వాడి స్కూల్ నూతన భవనము నిర్మాణముకు కృషిచేయడం గ్రామంలో ఉన్నక్రీడాకారులకు కబడ్డీ, క్రికెట్ కిట్టు మరియు ప్రోత్సాహం అదించడం, మన గ్రామంలో ఉన్న భజన భక్తులకు భజన సామగ్రి అందిస్తామని తెలిపారు. అకస్మాత్తుగా లేదా ప్రమాదవశాత్తు ఎవరైన చనిపోతే వారి కుటుంబానికి గ్రామ చేయుత పథకం క్రింద 5016 లు, 50 కిలోల బియ్యం ఉచితంగా అందిస్తా మని ఈ నెల14న జరిగే వర్పంచ్ ఎన్నికల్లో అమూల్యమైన ఓటును బ్యాటు గుర్తుకి వేసి ఆశీర్వదించాలని కోరారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -