- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: మొరాకోలోని ఫెజ్ నగరంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. రాత్రిపూట రెండు భవనాలు కూలిపోవడంతో 19 మంది మరణించారు. అలాగే 16 మంది గాయపడ్డారు. మృతులలో నలుగురు పిల్లలు కూడా ఉన్నారు. స్థానిక అధికారులు ఈ విషయాన్ని తెలిపారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
- Advertisement -



