Wednesday, December 10, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్హాస్టల్ విద్యార్థుల మెస్ బిల్లులు చెల్లించాలని మంత్రికి వినతి

హాస్టల్ విద్యార్థుల మెస్ బిల్లులు చెల్లించాలని మంత్రికి వినతి

- Advertisement -

నవతెలంగాణ – మిర్యాలగూడ 
సంక్షేమ హాస్టల్లో చదువుతున్న విద్యార్థులకు మెస్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కు వినతి పత్రం అందజేసినట్లు బీసీ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ జాజుల లింగం గౌడ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మెస్ బకాయిలు నెలలు గడుస్తున్న విడుదల చేయకపోవడంతో విద్యార్థులకు సరైన పోషకాహారం అందడం లేదని ఎనిమిది నెలల నుంచి బకాయిలు చెల్లించకపోవడం సరి కాదన్నారు. కాస్మెటిక్ చార్జెస్ జూన్, జూలై, ఆగస్టు నెలలకు సంబంధించిన బిల్లులు ట్రెజరీలో సబ్మిట్ చేసి రెండు నెలలకు పైగా అవుతున్నా కూడా ఇప్పటివరకు విద్యార్థుల అకౌంట్లో డబ్బులు పడలేదనీ పార్ట్ టైం వర్కర్లకు 12,196 రూపాయల జీతం ఉంటుందన్నారు. వీరికి కూడా మే, జూన్, జూలై మూడు నెలలకు బడ్జెట్ ఇచ్చిన హెడ్ ఆఫ్ ఎకౌంట్ ఇన్ వ్యాలిడ్ అని వస్తున్నదన్నారు. విద్యార్థులను వర్కర్లను వార్డెన్లను ఆదుకోవాలని వినతి పత్రంలో కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -