– సన్న వడ్లకు బోనస్ వెంటనే చెల్లించాలి
నవతెలంగాణ-కమ్మర్ పల్లి
గత రెండు నెలల క్రితం కొనుగోలు చేసిన మొక్కజొన్న డబ్బులు ఇప్పటి వరకు రైతు ఖాతాలో జమ కాలేదని వెంటనే రైతుల ఖాతాలో ప్రభుత్వం డబ్బులు జమ చేయాలని కమ్మర్ పల్లి గ్రామ రైతులు డిమాండ్ చేశారు. బుధవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రైతులు మాట్లాడారు. మండల కేంద్రంలో ఇటీవల మొక్కజొన్న, సన్న వడ్ల కొనుగోలను ఈ ప్రభుత్వం చేపట్టిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం సన్న వడ్లకు బోనస్ ఇస్తామని చెప్పి, కొందరి రైతులకు ఇచ్చి మిగిలిన రైతులకు ఇప్పటివరకు వేయలేదన్నారు.
మొక్కజొన్న పంటకు అందించిన డబ్బులను వెంటనే రైతు ఖాతాల్లో జమ చేయాలన్నారు. సన్నబడ్లకు సంబంధించిన బోనస్ డబ్బుల్ని కూడా రైతుల ఖాతాల్లో వేయాలని డిమాండ్ చేశారు. ఈ ప్రభుత్వానికి రైతులపై ఎలాంటి ప్రేమ లేదని అర్థమవుతుందన్నారు. ఈ ప్రభుత్వంలో ఇప్పటి వరకు గ్రామంలో చాలావరకు రుణమాఫీ కాలేదని, రైతు భరోసా రాలేదన్నారు. కొందరి రైతులకు ఇచ్చి మిగిలిన రైతులను ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందన్నారు. రైతు ప్రభుత్వం అని చెప్పుకొని రైతులను దగా చేస్తూ, నిండా ముంచిందని ఆరోపించారు.
ఇప్పటికైనా ఈ ప్రభుత్వం స్పందించి గ్రామంలో రైతులకు కొనుగోలు చేసిన మొక్కజొన్న పంటకు సరైన వార్లకు బోనస్ డబ్బులను రైతుల ఖాతాలో వేయాలని డిమాండ్ చేశారు. రైతులందరికీ రుణమాఫీ, రైతు భరోసా ఇవ్వాలని కోరారు. లేనిపక్షంలో ఆందోళనకు కార్యక్రమాలు చేపడతామని రైతులు హెచ్చరించారు. సమావేశంలో రైతులు సంత నడిపి రాజేశ్వర్, గోపిడి చిన్న రాజన్న, కొమ్ముల రాజన్న, కూలిపాటి గంగారెడ్డి, భామని రాజన్న, కొత్తపల్లి రఘు, బొడిగె రవి, తదితరులు పాల్గొన్నారు.



