నవతెలంగాణ – కామారెడ్డి
డిస్ట్రిబ్యూషన్ కేంద్రంలో సిబ్బందికి ఎన్నికల సామాగ్రి పంపిణీ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ బుధవారం పరిశీలించారు. గ్రామ పంచాయతీ మొదటి విడత ఎన్నికల పోలింగ్ నిర్వహణ కోసం పోలింగ్ సిబ్బందికి ఎన్నికల సామాగ్రి పంపిణీ కార్యక్రమాన్ని కామారెడ్డి జిల్లా లోని రాజంపేట్, దేవునిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్లను బుధవారం జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సందర్శించారు.
మొదటి విడత డిసెంబర్ 11 (నేడు జరిగే ) ఎన్నికలు
మొత్తం గ్రామ పంచాయతీలు 167, 10 గ్రామపంచాయతీ లేక గ్రీవన్ కాగా ఎన్నికలు జరుగుతున్న గ్రామపంచాయతీలు 157, మొత్తం పోలింగ్ స్టేషన్లు: 1533, ఏర్పాటు చేసిన పోలింగ్ స్టేషన్లు: 1457, పూర్తి సంస్థ ఏకగ్రీవంగా ఎన్నికైన వార్డులు: 76, పురుష ఓటర్లు: 1,18,342, మహిళా ఓటర్లు: 1,30,322, ఇతరులు: 4, మొత్తం ఓటర్లు: 2,48,668, సిబ్బంది నియామకం ( ఫేస్–I): పోలింగ్ అధికారులు (పి ఓ): 1848, ఇతర పోలింగ్ అధికారులు ( ఒ పి ఓ): 2501, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో విధులు నిర్వహించే అధికారి అప్రమత్తంగా ఉంటూ ఎన్నికలను సజావుగా నిర్వహించాలని ఆన్నారు.
డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని సందర్శించి పోలింగ్ అధికారులకు ఇచ్చిన ఎన్నికల సామాగ్రి, బ్యాలెట్ పేపర్లను, పోలింగ్ బాక్సులను పరిశీలించారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో కావాల్సిన సామాగ్రిని పోలింగ్ కేంద్రం వారి గా వేరు చేసి సిద్ధంగా ఉంచాలన్నారు. బ్యాలెట్ పత్రాలు జాగ్రత్త గా చెక్ చేసి ప్యాక్ చేయాలని తెలిపారు. డిస్ట్రిబ్యూషన్ కేంద్రం నుండి పోలింగ్ కేంద్రం చేరుకొని ఓటింగ్ నిర్వహణ ఏర్పాట్లను మరోసారి నిర్ధారణ చేసుకోవాలన్నారు. సిబ్బంది రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని, వారికి ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం కల్పించాలని, విద్యుత్ అంతరాయం లేకుండా నిరంతరం విద్యుత్ సరఫరా ఉండేలా చూడాలన్నారు.
ఏమైనా లోపాలు కనిపిస్తే వెంటనే తెలియజేయాలని, త్రాగునీరు, లైటింగ్, పార్కింగ్ ప్రదేశాలలో, తదితర ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని ఆన్నారు. ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా, అడ్డంకిలేకుండా సాగేందుకు అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ సూచించారు.



