నవతెలంగాణ రాజన్న సిరిసిల్ల
డిసెంబర్ 7,8,9 తేదీలలో మెదక్ జిల్లా కేంద్రంలో జరిగిన సిఐటియు తెలంగాణ రాష్ట్ర 5వ మహాసభలకు రాజన్న సిరిసిల్ల జిల్లా నుండి 8 మంది ప్రతినిధులు హాజరు అయ్యారు. మహాసభలలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలు , రాష్ట్రంలో కార్మిక వర్గం ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించి భవిష్యత్తు ఉద్యమ పోరాట కార్యాచరణను రూపొందించారు. అనంతరం నూతన రాష్ట్ర కమిటీని ఎన్నుకున్నారు. సిఐటియు రాష్ట్ర కౌన్సిల్ మరియు కమిటీ సభ్యులుగా సిఐటియు రాజన్న సిరిసిల్ల జిల్లా కార్యదర్శి కోడం రమణ , బీడీ వర్కర్స్ యూనియన్ నుండి రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ గా సూరం పద్మ లు ఎన్నికయ్యారు. మహాసభలకు రాజన్న సిరిసిల్ల జిల్లా నుండి సిఐటియు జిల్లా అధ్యక్షులు ఎగమంటి ఎల్లారెడ్డి , జిల్లా కార్యదర్శి కోడం రమణ , జిల్లా ఉపాధ్యక్షులు గుర్రం అశోక్ , సూరం పద్మ , కార్యదర్శి గీస బిక్షపతి , నక్క దేవదాస్ , ఎలిగేటి రాజశేఖర్ , దాసరి రూప హాజరయ్యారు.
సీఐటీయూ రాష్ట్ర కౌన్సిల్, కమిటీ మెంబర్ గా కోడం రమణ ఎన్నిక
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



