- Advertisement -
స్టోన్ బెంచ్ స్టూడియో, జీ స్క్వాడ్ కలయికలో రూపొందుతున్న మూవీకి ’29’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. దీనికి రత్నకుమార్ రచన, దర్శకత్వం వహిస్తున్నారు. రియలిజం, ఫీల్ గుడ్, రా ఎమోషన్స్‌తో యూనిక్ స్టోరీతో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. గ్రిప్పింగ్ స్టోరీతో, హృదయాలను హత్తుకునే మానవ సంబంధాలను తెలియజేసేలా, ప్రేమ గొప్పదనాన్ని తెలియజేసే ప్రేమ కథా చిత్రంగా రానుంది. విదు, ప్రీతి అస్రాని ప్రధాన పాత్రల్లో నటించారు. ఆసక్తికరమైన కథా నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది తప్పక చూడాల్సిన అత్యంత ఆసక్తికర చిత్రాల్లో ఒకటిగా నిలస్తుందని మేకర్స్ తెలిపారు.
- Advertisement -



