Thursday, December 11, 2025
E-PAPER
Homeతాజా వార్తలువెంకీ, త్రివిక్రమ్‌ సినిమా షూటింగ్‌ మొదలైంది

వెంకీ, త్రివిక్రమ్‌ సినిమా షూటింగ్‌ మొదలైంది

- Advertisement -

హీరో వెంకటేష్‌, దర్శకుడు త్రివిక్రమ్‌ కలయికలో రానున్న సినిమాకి ‘ఆదర్శ కుటుంబం హౌస్‌ నెం: 47’ అనే ఆసక్తికర టైటిల్‌ను ఖరారు చేశారు. వెంకటేష్‌ సినీ ప్రయాణంలో 77వ చిత్రంగా రూపొందుతున్న చిత్రమిది. ఈ చిత్ర ఫస్ట్‌ లుక్‌లో వెంకటేష్‌ ఫ్యామిలీ మ్యాన్‌ లుక్‌లో క్లాస్‌గా కనిపిస్తున్నారు. హృదయాన్ని తాకే భావోద్వేగాలతో నిండిన ఆసక్తికర కథాంశంతో ఈ చిత్రం రాబోతోందనే సంకేతాన్ని ఫస్ట్‌లుక్‌ ఇస్తోంది. బుధవారం హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో చిత్రీకరణ మొదలైంది. హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌ పతకంపై ఎస్‌.రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తున్న ఈ చిత్రం 2026 వేసవిలో భారీగా విడుదలకు సిద్ధమవుతోంది. వెంకటేష్‌, త్రివిక్రమ్‌ కలయిక కావడంతో ఇప్పటికే అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పుడు టైటిల్‌, ఫస్ట్‌ లుక్‌ విడుదలతో అంచనాలు రెట్టింపు అయ్యాయి. ప్రేక్షకులు, అభిమానులు ఈ అద్భుత కలయిక తెరపై ఏ మాయ చేస్తుందోనని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆ అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా.. హాస్యం, భావోద్వేగాల మేళవింపుతో వెండితెరపై వినోదాల విందుని ఈ సినిమా అందిస్తుందనే దీమాని మేకర్స్‌ వ్యక్తం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -