Thursday, December 11, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పేరు కేమో కిరాణం నడిచేది మద్యం దందా..

పేరు కేమో కిరాణం నడిచేది మద్యం దందా..

- Advertisement -

– కాటారం మండలం లో బెల్ట్ షాప్స్ దందా
– బెల్ట్ షాప్ లపై చెర్యలు శూన్యం
– ఎలక్షన్ కోడ్ అమల్లో కన్నెత్తి చూడని అధికారులు
– గ్రామాల్లో ఎరులై పరుతున్న మద్యం

నవతెలంగాణ కాటారం

ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్న మండలంలో బెల్ట్ షాప్స్ విచ్చలవిడిగా నడుస్తున్నాయి. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చి వారం రోజులు దాటినా గ్రామాల్లో మాత్రం బెల్ట్ షాపులు మద్యం ఎరులై పరుతుంది. ఏ క్కడ చూసిన పర్మిట్ రూములు బార్ షాపుల తలపిస్తున్నయి. ప్రభుత్వం కొత్త టెండర్లు వేసి డిసెంబర్లో ఒకటిన నూతన వైన్ షాప్ లు ఏర్పాటు చేయించింది. ఏర్పాటు చేయగా దందా సాగుతున్న అధికార యంత్రాంగం పట్టించుకోకపోవడంతో సర్వత్ర తీవ్ర విమర్శలు వెలువెత్తుతున్నాయి. స్థానిక సంస్థలు ఎన్నికల కోడ్ ఆ శాఖ కు వర్తించదా..? అని ప్రజలు చర్చించి కుంటున్నారు.

కోడ్ వచ్చి వారంపైన అయినా ఆగని మద్యం

సాధారణ సమయాల్లో ఆయా గ్రామాల్లో బెల్ట్ దుకాణాలు జోరు గా నడుస్తాయి. వాటిని కట్టడి చేసేందుకు ప్రభుత్వ యంత్రాంగం చర్యలు తీసుకోదు. పైగా వైన్స్ యజమాలను పూరమాయిస్తుంది. అదే అదనగా భావించి పేరుకు కిరాణ దుకాణంగా బోర్డు తగిలించి గల్లీగో బెల్ట్ దుకాణం వెలిసే విధంగా ఆ శాఖ అధికారులు ప్రోత్సహించడం అంటే ఇక వారి పనితీరు కోసమెరుపు… ఒక గ్రామంలో మూడు నుంచి 15 దుకాణం ఉన్నాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. మండలంలో మూడు వైన్ షాపులు ఉండగా సుమారు 200 వరకు బెల్ట్ షాపులు ఉన్నట్టు తెలిసింది. పేరుకే మూడు వైన్ షాపులు కానీ నడిచేటివి రెండు వైన్ షాపులు ఒక వైన్ షాపు బెల్టు షాపుల దందాకి కేటాయించడం జరిగింది. స్థానిక సంస్థల ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చి వారంపైన అయినా అధికారులు మాత్రం ఏమి పట్టనట్టు వ్యవహరిస్తున్నారు.

పేరుకే కిరాణం నడిచేదంతా బెల్ట్ దందా

గ్రామాల్లో ఉన్న కిరాణా షాపుల్లోను చాలా వరకు మద్యం అమ్ముతారు. పేరుకే కిరాణం దుకాణం అని కనిపిస్తుంది. ఒకప్పుడు బెల్ట్ షాపులు గ్రామానికి ఒకటి రెండు ఉండేవి. కానీ నేడు విచ్చలవిడిగా కొనసాగుతున్న రాత్రి పగలు తేడా లేకుండా జోరుగా అమ్మకాలు జరుపుతున్నారు. ఈ విషయం ఎక్సైజ్, పోలీస్ శాఖ అధికారులకు తెలియదా..? లేక మామూలు సమయంలో లాగే ఎన్నికల కోడ్ అమలులో ఉన్న వైన్స్ షాప్ లకు సహకరిస్తున్నారా…? అని ఆరోపాలు వినిపిస్తున్నాయి. ఎమ్మార్పీ ధర కంటే క్వార్టర్కు 20 నుంచి 40 బెల్ట్ షాపులు వసూలు చేస్తున్నారు.మందు, గ్లాసు, వాటర్ , స్టాప్ కొనుక్కొని వెసులుబాటు కూడా కల్పిస్తున్నారు. అంతేకాకుండా పరిమితములు ఏర్పాటు చేస్తున్నారు. దీంతో కిరణ్ షాపులన్నీ బార్ షాప్ కల్పిస్తున్నాయి. మద్యం సేవించాకే అస్సలు పంచాయితీ షురూ చేస్తున్నారు.

వైన్ షాపులు రాత్రి 10 గంటల వరకే ఉంటాయి. ఆ తర్వాత అంతా బెల్ట్ దుకాణాల దందా కొనసాగుతుంది. పీక లోతు తాగాక తరచుగా గొడవలు చేసుకోవచ్చు. మద్యం సేవించక అసలు పంచాయతీ షురూ అవుతుంది . అవి మితిమీరితే ఘర్షణ యొక్క దారి తీసే ప్రమాదం లేకపోలేదు. బెల్ట్ షాపులు కలిసిన ఎక్సైజ్ అధికారులు ఏం చేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. అన్ని తెలిసి కూడా చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రచారం జరుగుతుంది. మరోవైపు మద్యం యజమానులు, బెల్ట్ షాపు యజమానుల, అధికారులు మధ్య ఒప్పందాలతోనే ఇదంతా సాగుతుందా..? అని ప్రజల నుండి గుసగుసలు వినిపిస్తున్నాయి . తరలిస్తేనే ఎన్నికల ప్రశాంతంగా జరుగుతాయి.అని ప్రజలు భావిస్తున్నారు. ఎన్నికలు ముగిసే నాటికి బిల్ షాప్ పై ఎక్సైజ్ , పోలీస్ , రెవెన్యూ శాఖ ఎలాంటి చర్యలు తీసుకొంటుందో చూడాల్సిందే

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -