Thursday, December 11, 2025
E-PAPER
Homeమానవిఉదయం ఈ ఫుడ్స్‌ తింటే…

ఉదయం ఈ ఫుడ్స్‌ తింటే…

- Advertisement -

తినే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. కొన్ని ఆహారాలు తింటే బరువు తగ్గవచ్చు. రోజూ ఉదయం తినే బ్రేక్‌ఫాస్ట్‌లో కొన్ని ఆహారాల్ని చేర్చుకోవడం వల్ల బరువు తగ్గవచ్చని నిపుణులు అంటున్నారు. ఈ ఫుడ్స్‌ తినడం వల్ల బరువు తగ్గడంతో పాటు రోజంతా యాక్టివ్‌గా ఉండవచ్చు. బరువు తగ్గడానికి ఏ ఫుడ్స్‌ ఉపయోగపడతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

గుడ్లు : ప్రతి రోజూ ఒక గుడ్డు తినడం ఆరోగ్యానికి మంచిదని నిపుణులు చెబుతున్నారు. గుడ్లు ప్రోటీన్‌ యొక్క అద్భుతమైన వనరు. ఇది బరువు తగ్గడానికి చాలా సాయపడుతుంది. గుడ్డులో అధిక నాణ్యత ప్రోటీన్‌, ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. ఇవి ఎక్కువసేపు కడుపును నిండుగా ఉంచుతాయి. దీంతో, అతిగా తినాలనే కోరిక తగ్గుతుంది. అల్పాహారంగా గుడ్లు తినడం వల్ల రోజంతా కేలరీల తీసుకోవడం తగ్గుతుంది. ఇది బరువును నియంత్రించడంలో సాయపడుతుంది.

ఓట్స్‌ : ఈ రోజుల్లో చాలా మంది ఓట్స్‌ తింటున్నారు. ఓట్స్‌లో ఫైబర్‌ పుష్కలంగా ఉంటుంది. వీటిలో బీటా-గ్లూకాన్‌ అనే ప్రత్యేక రకమైన ఫైబర్‌ ఉంటుంది. ఇది జీర్ణక్రియను నెమ్మదించేలా చేస్తుంది. దీంతో ఆకలి నియంత్రణలో ఉంటుంది. ఎక్కువ తినాలనే కోరిక అదుపులో ఉంటుంది. ఓట్స్‌లో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. దీంతో, రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరంగా ఉంచడంలో ఓట్స్‌ సాయపడతాయి. ఉదయం పాలు లేదా పెరుగుతో ఓట్స్‌ తినడం బరువు తగ్గడానికి బెస్ట్‌ ఛాయిస్‌.

గ్రీక్‌ యోగర్ట్‌ : బరువు తగ్గాలనుకునేవారికి గ్రీక్‌ యోగర్ట్‌ కూడా మంచి ఆప్షన్‌. గ్రీకు యోగర్ట్‌ అంటే ఇదో రకమైన పెరుగు. ఇది ప్రోటీన్‌ యొక్క అద్భుతమైన మూలం. దీన్ని తినడం వల్ల మిమ్మల్ని ఎక్కువసేపు కడుపు నిండి ఉండేలా చేస్తుంది. ఇందులో ప్రోబయోటిక్స్‌ కూడా ఉంటాయి. ఇవి జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతాయి. అంతేకాకుండా జీవక్రియను మెరుగుపరుస్తాయి. బరువు తగ్గడానికి, తక్కువ కొవ్వు లేదా రుచిలేని గ్రీకు పెరుగును ఎంచుకుని, బెర్రీలు, వాల్‌నట్‌లు లేదా తేనె జోడించి తినండి.

చియా విత్తనాలు : ఈ రోజుల్లో చాలా మంది చియా సీడ్స్‌ తింటున్నారు. చియా సీడ్స్‌ బరువు తగ్గించే ప్రక్రియలో కీలక పాత్ర పోషిస్తాయి. ఇవి చిన్నవిగా ఉంటాయి. కానీ, వీటిలో ఫైబర్‌, ప్రోటీన్లు సమద్ధిగా ఉంటాయి. ఇవి నీటిని పీల్చుకుని జెల్‌లాగా మారతాయి.

గింజలు, విత్తనాలు : బాదం, వాల్‌నట్స్‌, గుమ్మడి గింజలు, పొద్దుతిరుగుడు విత్తనాలు వంటివి ఆరోగ్యానికి మేలు చేయడమే కాకుండా బరువు తగ్గించడంలో కీలకపాత్ర పోషిస్తాయి. వీటిలో ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్‌, ఫైబర్‌ సమద్ధిగా ఉంటాయి. ఇవి ఆకలిని నియంత్రిస్తాయి. అంతేకాకుండా అనారోగ్యకరమైన స్నాక్స్‌ తినాలనే కోరికను తగ్గిస్తాయి.

ఆకుకూరలు : ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఆకుకూరలు బరువు తగ్గాలనుకునేవారికి మంచి ఆప్షన్‌. పాలకూర, మెంతి కూర వంటి ఆకుకూరల్లో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. కానీ ఫైబర్‌, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. వాటిని ఉదయం ఆమ్లెట్లు, స్మూతీలు లేదా పరాఠాలలో యాడ్‌ చేసుకుని తినవచ్చు. ఆకుకూరలు జీవక్రియను పెంచుతాయి. దీంతో బరువు తగ్గడం వేగవంతం అవుతుందని నిపుణులు అంటున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -