Thursday, December 11, 2025
E-PAPER
Homeసినిమా'అఖండ 2' కోసం రిలీజ్‌ వాయిదా

‘అఖండ 2’ కోసం రిలీజ్‌ వాయిదా

- Advertisement -

హెచ్‌ఎన్‌జి సినిమాస్‌ ఎల్‌ఎల్‌పి బ్యానర్‌ పై ఉదరు శర్మ రచన, దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘స:కుటుంబానాం’.మహదేవ్‌ గౌడ్‌, నాగరత్న నిర్మాతలు. రామ్‌ కిరణ్‌, మేఘ ఆకాష్‌ జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో రాజేంద్రప్రసాద్‌, బ్రహ్మానందం, శుభలేఖ సుధాకర్‌, సత్య, రాజశ్రీ నాయర్‌, తదితరులు కీలకపాత్రల్ని పోషించారు. అయితే ఈనెల 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రం బోయపాటి శ్రీను దర్శకత్వంలో నందమూరి బాలకష్ణ నటించిన ‘అఖండ తాండవం’ చిత్రం అదే రోజున ప్రేక్షకుల ముందుకు వస్తున్న కారణంగా బాలయ్య పై ఉన్న గౌరవంతో ఈ చిత్రాన్ని ఈనెల 19వ తేదీన విడుదల చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఈనెల 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న నందమూరి బాలకష్ణ చిత్రం పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాం అని నిర్మాతలు చెప్పారు.
కొన్ని నిర్ణయాలు వ్యాపారం కోసం కాదు, ఎమోషన్స్‌ కోసం. అదేవిధంగా ఈ నిర్ణయం కూడా ‘జై బాలయ్య’ అనే తెలుగువారి నినాదం కోసం అని అన్నారు.
‘ప్రతి మనిషికి కుటుంబం చాలా అవసరం అని చెప్పే సినిమా ఇది. అనుబంధాలకు ప్రతీకగా మా సినిమా నిలుస్తుంది. ఈ మధ్యకాలంలో ఈ తరహా సినిమాలేదని గర్వంగా చెప్పగలం. కుటుంబం, బంధాలు, విలువల గురించి ఈ సినిమాలో అత్యద్బుతంగా చూపించబోతున్నాం. మా సినిమాని ప్రేక్షకులందరూ ఆదరించి, సపోర్ట్‌ చేస్తారని ఆశిస్తున్నాం’ అని చిత్రయూనిట్‌ తెలిపింది.
రచ్చ రవి, గిరిధర్‌, తాగుబోతు రమేష్‌, భద్రం తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి రచన- దర్శకత్వం: ఉదరు శర్మ, నిర్మాత: హెచ్‌ మహదేవ గౌడ్‌, సంగీతం: మణి శర్మ, డీఓపీ : మధు దాసరి, ఎడిటర్‌: శశాంక్‌ మలి, కొరియోగ్రాఫర్‌: చిన్ని ప్రకాష్‌, భాను, విజరు పొలాకి,
సాహిత్యం: అనంత శ్రీరామ్‌, ఆర్ట్‌ డైరెక్టర్‌: వర్మ, ఫైట్స్‌: అంజి, కార్తీక్‌,
ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ : రోహిత్‌ కుమార్‌ పద్మనాభ.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -