ఈషా రెబ్బా, సత్య, హర్ష చెముడు, సూర్య శ్రీనివాస్, సత్యం రాజేశ్, కుషిత కల్లపు ప్రధాన పాత్రల్లో నటించిన ఆహా ఒరిజినల్స్ వెబ్ సిరీస్ ‘త్రీ రోజెస్’.
ఆహా ఓటీటీలో సూపర్ హిట్ అయిన ఈ సిరీస్ సీజన్ 2 ఈనెల 13వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌కు రెడీ అవుతోంది. ఈ సిరీస్‌ను మాస్ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఎస్‌కేఎన్ నిర్మించారు. డైరెక్టర్ మారుతి షో రన్నర్‌గా వ్యవహరిస్తున్నారు.
రవి నంబూరి, సందీప్ బొల్ల రచన చేయగా, కిరణ్ కె కరవల్ల దర్శకత్వం వహించారు. ఈ వెబ్ సిరీస్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నటి ప్రగతి మాట్లాడుతూ, ‘నేను సినిమాలు మానేయలేదు. చిన్న గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్‌లో పవర్ లిఫ్టింగ్ ప్రాక్టీస్ చేశా. మన దేశం జెండా వేసుకుని ఏషియన్ గేమ్స్‌లో సిల్వర్ మెడల్ తీసుకొచ్చా. ప్రస్తుతం ఒక తమిళ సినిమాలో విలన్‌గా నటిస్తున్నా. సినిమాలే నా జీవితం. సినిమానే నాకు అన్నీ ఇచ్చింది. సినిమాలను వదులుకోను. పవర్ లిఫ్టింగ్‌లో నేను సాధించిన విజయాల పట్ల విశెస్ అందించి, ఈ ఈవెంట్‌కు గెస్ట్‌గా పిలిచిన ఎస్ కేఎన్‌కి థ్యాంక్స్. నేను సాధించిన మెడల్స్ ఇండిస్టీలోని యాక్ట్రెస్ అందరికీ అంకితమిస్తున్నా’ అని అన్నారు.
‘మారుతి ఐడియా నుంచే ఈ త్రీ రోజెస్ వెబ్ సిరీస్ మొదలైంది. ఎస్ కేఎన్ మాలాంటి డైరెక్టర్స్‌కు వరం అనుకోవచ్చు. వెబ్ సిరీస్ అయినా ఒక సినిమాకు చేసినంత ప్రమోషన్ చేస్తున్నారు. త్రీ రోజెస్ సీజన్ 1 కంటే సీజన్ 2ను బాగా ఎంజారు చేస్తారు’ అని డైరెక్టర్ కిరణ్ కె కరవల్ల చెప్పారు. డైరెక్టర్ మారుతి మాట్లాడుతూ,’ఈ సీజన్ 2కు ఈషా, రాశీ, కుషితో పాటు మరో హీరో ఉన్నారు. అతనే ఎస్‌కేఎన్. ఒక వెబ్ సిరీస్‌ను ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లి సక్సెస్ చేశాడంటే ఎస్ కేఎన్‌ను హీరోగానే చూడాలి’ అని తెలిపారు.
‘నా నెక్ట్స్ మూవీస్‌లో హీరోయిన్స్‌గా హారిక, రూపా, బాంధవి చేయబోతున్నారు. తెలుగు అమ్మాయిలను ఎంకరేజ్ చేసే ప్రయత్నంలో వీళ్లందరికీ అవకాశాలు కల్పిస్తున్నా. డైరెక్టర్ కిరణ్ ఇకపై మాతో ట్రావెల్ చేస్తాడు. అలాగే రైటర్ సందీప్‌ను డైరెక్టర్‌ను చేయబోతున్నా. త్రీ రోజెస్ సీజన్ 3ని సినిమాగా చేయబోతున్నాం. ప్రగతి సాధించిన విజయాన్ని మనమంతా సెలబ్రేట్ చేసుకోవాలి. 180 దేశాలు పాల్గొన్న ఏషియన్ గేమ్స్‌లో ఇండియాకు పవర్ లిఫ్టింగ్‌లో ఆమె నాలుగు మెడల్స్ సాధించారు. ప్రేక్షకులను అర్థం చేసుకోగలను. అందుకే నా సినిమా టికెట్ రేట్స్ అందుబాటులో ఉంచుతున్నాను’ అని నిర్మాత ఎస్ కేఎన్ చెప్పారు.
అంతకు మించి..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



