రాష్ట్ర ప్రభుత్వంతో అమెజాన్ ఒప్పందం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
తమ క్లౌడ్ డేటా సెంటర్ మౌలిక సదుపాయలను విస్తరించేందుకు అమెజాన్ వెబ్ సర్వీసెస్ (ఏడబ్ల్యూఎస్) 7 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టేందుకు సిద్ధమైంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. వ్యూహాత్మక ఫ్రేమ్ వర్క్ ఒప్పందంపై రాష్ట్ర ప్రభుత్వం, అమెజాన్ సంతకాలు చేశాయి. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025 నిర్వహణతో తర్వాత, రాబోయే 14 ఏండ్లలో ఈ పెట్టుబడులు పెట్టనున్నట్టు అమెజాన్ వెల్లడించింది. అమెజాన్ తీసుకున్న నిర్ణయం పట్ల సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ శాఖ మంత్రి డి.శ్రీధర్ బాబు హర్షం వ్యక్తం చేశారు. ఏడబ్ల్యూఎస్ ఇండియా, సౌత్ ఆసియా అధ్యక్షులు సందీప్ దత్తా మాట్లాడుతూ ఈ పెట్టుబడులతో ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయనీ, స్థానికంగా వ్యాపారం పెరిగి ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.స్టాల్ట్ నీల్సన్ హైదరాబాద్‌లోని తన సెంటర్ ను ఉత్పత్తుల అభివృద్ధికి, డిజిటల్ ఆవిష్కరణలు తదితర వాటికి గ్లోబల్ హబ్ మార్చేందుకు ముందుకొచ్చింది.
బిలియన్ డాలర్లతో క్లౌడ్ డేటా సెంటర్ విస్తరణ
- Advertisement -
- Advertisement -



