Friday, December 12, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంఓయూలో రేవంత్‌ ప్రసంగం విషపూరితం : బీఆర్‌ఎస్‌

ఓయూలో రేవంత్‌ ప్రసంగం విషపూరితం : బీఆర్‌ఎస్‌

- Advertisement -

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఉస్మానియా విశ్వవిద్యాలయం (ఓయూ)లో చేసిన ప్రసంగం విషపూరితమని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్‌ విమర్శించారు. మూడు రూపాయల మైండ్‌సెట్‌తో మూడు ట్రిలియన్‌ డాలర్ల ఎకానమీ రాదని ఎద్దేవా చేశారు. గురువారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ నల్లమల అడవు లతో సీఎంకు ఎలాంటి సంబంధం లేదన్నారు. ఆయన పుట్టిన కొండారెడ్డిపల్లి నుంచి నల్లమలకు గంటన్నర ప్రయా ణమని వివరించారు. తెలంగాణ ఉద్యమంపై తుపాకి ఎక్కుపెట్టిన రేవంత్‌ ఓయూలో ఉద్యమం గురించి మాట్లాడటం సిగ్గుచేటని అన్నారు. యాదయ్య, వేణుగోపాల్‌రెడ్డి లాంటి అమరులు తెలంగాణ ద్రోహుల వల్లే ప్రాణాలు కోల్పోయారని విమర్శిం చారు. రేవంత్‌రెడ్డి ఫ్యూడల్‌ మనస్తత్వం ఉన్నవారనీ, అందుకే కేసీఆర్‌ స్థాపించిన గురుకులాలను ఇంటిగ్రేటెడ్‌ స్కూళ్ల పేరుతో నిర్వీర్యం చేస్తున్నారని ఆరోపించారు. 2.5 లక్షల మందికి నాణ్యత విద్య ఇస్తూ మిగతా 15 లక్షల మందిని విద్యకు దూరం చేస్తున్నారని విమర్శించారు. 42 శాతం రిజర్వేషన్లపై బీసీల గొంతు కోసి సామాజిక న్యాయం గురించి మాట్లాడటం డ్రామా అని అన్నారు. అది తెలంగాణ రైజింగ్‌ కాదనీ, రావేజింగ్‌ అని చెప్పారు. గ్లోబల్‌ సమిట్‌లో సీఎం ధరించిన బట్టలు చూసి ఎవరైనా పెట్టుబడులు పెడతారా?అని ప్రశ్నించారు. కేసీఆర్‌పై విషం చల్లే మాటలు మానేస్తే రేవంత్‌రెడ్డికే మంచిదని సూచించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -