Friday, December 12, 2025
E-PAPER
Homeతాజా వార్తలుఏపీలో మరో ఘోర రోడ్డు ప్రమాదం..సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి

ఏపీలో మరో ఘోర రోడ్డు ప్రమాదం..సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : ఏపీలో మరో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. చిత్తూరు జిల్లాకు చెందిన ప్రయివేటు ట్రావెల్స్ బస్సు చింతూరు-మారేడుమిల్లి ఘాట్ రోడ్డులో రాజుగారి మెట్టు దగ్గర అదుపుతప్పి పక్కనే ఉన్న లోయలో పడిపోయింది. ఈ ఘటన అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మండలం తులసిపాకలు మోతుగూడెం పోలీస్ స్టేషన్ పరిధిలో ఇవాళ(శుక్రవారం) ఉదయం జరిగింది. ఈ బస్సు ప్రమాద ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బస్సులో 35 మంది ప్రయాణికులు ఉన్నారని, పలువురు మృతి చెందగా గాయపడిన వారిని చింతూరు ఆస్ప‌త్రికి తరలించామని అధికారులు సీఎం చంద్రబాబుకు తెలిపారు. సహాయక చర్యలు, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు చంద్రబాబు ఆదేశించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -