Friday, December 12, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఈ గుంతలు తీసిందేవరూ..?

ఈ గుంతలు తీసిందేవరూ..?

- Advertisement -

– ప్రధాన రోడ్డుకు ఇరువైపులా తవ్వకాలు 
నవతెలంగాణ-మల్హర్ రావు
ప్రభుత్వ సొమ్ము వేలాది రూపాయలు ఖర్చుచేసి వందలాది గుంతలు తవ్వకాలు చేపట్టి వృధాగా వదిలేసిన సంఘటన మండలంలోని కొయ్యుర్ గ్రామపరిధిలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల ప్రకారం.. కాటారం-మంథని ప్రధాన రహదారికి ఇరువైపులా కొయ్యుర్ గ్రామపంచాయతీ పరిదిలోగల నాగులమ్మ క్రాస్ నుంచి శ్మశాన వాటిక వరకు సుమారుగా 50 మీటర్ల దూరం, రెండు పిట్ల లోతుగా వందలాది గుంతలు తవ్వకాలు చేపట్టి నెలలు గడుస్తున్నా పట్టించుకున్న నాథులు కరువైయ్యారు.ఈజిఎస్ లో మొక్కలు నాటేందుకు తిశారాని ఏపిఓను వివరణ కోరగా తమ ఆధ్వర్యంలో గుంతలు తీయలేదని చెప్పారు. నాగులమ్మ క్రాస్ నుంచి శ్మశాన వాటిక వరకు డేంజర్ జోన్ ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న నేపథ్యంలో ఆర్అండ్బి అధికారులు హెచ్చరికలు పోల్స్ వేయడానికి తీసి ఉంటారని తెలుకునే ప్రయత్నం చేయగా అందుబాటులోకి రాలేదు. ఏది ఏమైనా ఈ గుంతలపై సందిగ్ధం తెలుపాలని పలువురు కోరుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -