నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ : గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 14 వ తేదీన పోలింగ్ సందర్బంగా రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు పోలింగ్ ముగింపు సమయం మధ్యాహ్నం 1:00 గంటల వరకు – నిశ్శబ్ద కాలం అమలు అవుతుందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హనుమంతరావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా జిల్లాలో రెండవ విడత భువనగిరి, బీబీనగర్, పోచంపల్లి, వలిగొండ, రామన్నపేట మండలంలో జరిగే ఎన్నికల సందర్బంగా ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరగనున్న ప్రాంతాలలో, పోలింగ్ ముగింపు సమయానికి 44 గంటల ముందు నుండి నిశ్శబ్ద కాలం అమలులో ఉంటుందని కలెక్టర్ తెలిపారు.
12 వ తేదీన సాయంత్రం 5:00 గంటల నుండి14.12.2025 మధ్యాహ్నం 1:00 గంటల వరకు సంబంధిత పోలింగ్ ప్రాంతాలలో కింది తెలిపిన కార్యక్రమాలు పూర్తిగా నిషేధించిన్నట్లు తెలిపారు. ఎటువంటి బహిరంగ సమావేశాలు, సభలు, ఊరేగింపులు నిర్వహించరాదన్నారు. సినిమా, టెలివిజన్, సోషల్ మీడియా లేదా ఇతర మాధ్యమాల ద్వారా,సంగీత, నాటక, వినోద కార్యక్రమాల ద్వారా ఎన్నికల ప్రచారం చేయరాదన్నారు. ఈ ఆదేశాలను ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.



