సిరిసిల్ల డీఎస్పీ నాగేంద్రచారి
నవతెలంగాణ – రాజన్న సిరిసిల్ల
గ్రామపంచాయతీ ఎన్నికల సందర్భంగా జిల్లాలో అక్రమ మద్యం రవాణా,వి క్రయాలపై ప్రత్యేక దృష్టి సారించి ఆకస్మిక తనిఖీలు చేస్తామని సిరిసిల్ల డీఎస్పీ నాగేంద్రచారి హెచ్చరించారు. ఎన్నికల సమయంలో హోల్‌సేల్ రూపంలో భారీగా మద్యం ఆమ్మిన వారిపై, కొనుగోలు చేసిన వారిపై నిఘా కఠినతరం చేసి వారిపై కేసులు నమోదు చేస్తామని తెలిపారు. ఎన్నికల నియమావళి అమలులోకి వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు మొత్తం 90 కేసుల్లో 1337 లీటర్ల మద్యం సీజ్ చేసినట్లు ఆయన వెల్లడించారు. గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికలు ముగిసే వరకు ఎన్నికల నియమావళి పకడ్బందీగా అమలు చేస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం ఉన్న ఆంక్షలను తప్పనిసరిగా పాటించాలని, ఎన్నికల నియమావళిని అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు ఎదుర్కోక తప్పదని అన్నారు. ప్రజాస్వామ్య ప్రక్రియ సజావుగా సాగాలంటే నిబంధనలు పాటించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని మరోసారి గుర్తు చేశారు.
అక్రమ మద్యం రవాణా, విక్రయాలు, కొనుగోళ్లపై ప్రత్యేక నిఘా
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



