నవతెలంగాణ – హైదరాబాద్ : ఉత్తర జపాన్ తీరంలో శక్తివంతమైన భూకంపం సంభవించినట్లు వాతావరణ శాఖ శుక్రవారం తెలిపింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 6.7గా నమోదైందని హోన్షు ప్రధాన ద్వీపంలోని ఇవాటి ప్రిఫెక్చర్‌లోని కుజి నగరానికి 130కి.మీ దూరంలో ప్రకంపనలు వచ్చినట్లు పేర్కొంది. సునామీ హెచ్చరికలు జారీ చేసింది. ఉత్తర పసిఫిక్ తీర ప్రాంతంలో అలలు ఒక మీటరు వరకు అలలు తాకవచ్చని హెచ్చరించింది. సోమవారం రాత్రి సంభవించిన 7.5 తీవ్రతతో సంభవించిన భూకంపం కన్నా ఇది తక్కువగా ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అమోరిలోని స్టీల్ టవర్ సమీపంలో నివసిస్తున్న గురువారం ఖాళీ చేయమని ఆదేశాలు జారీ చేసినట్లు స్థానిక మీడియా తెలిపింది. స్టీల్ టవర్ కూలిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించింది. వారం రోజుల పాటు ఇటువంటి లేదా అంతకంటే ఎక్కువ తీవ్రతతో భూకంపం సంభవించే అవకాశం ఉన్నట్లు తెలిపింది.
జపాన్‌లో భారీ భూకంపం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



