- Advertisement -
నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ మండలంలోని రుశేగావ్ గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి సావిత్రిబాయి రామస్వామి హవా కొనసాగుతోంది. ఎన్నికల ప్రచారాన్ని కాంగ్రెస్ పార్టీ మండల పార్టీ అధ్యక్షులు ధరాస్ సాయిలు శుక్రవారం రుశేగావ్ గ్రామాన్ని సందర్శించి పరిశీలించారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ప్రచారం ముమ్మరంగా హవా కొనసాగుతుండడం పట్ల ఆయన అభినందించారు. గెలుపు కోసం మరింతగా కృషి చేయాలని ఆ గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు సూచన చేశారు. మండల పార్టీ అధ్యక్షుని వెంట మద్నూరు సింగిల్ విండో మాజీ చైర్మన్ కొండ గంగాధర్ పాల్గొన్నారు.
- Advertisement -



